'కరోనా వైరస్' .. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 396కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య 81గా నమోదైంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు కేంద్రం నిన్న(ఆదివారం) జనతా కర్ఫ్యూ విధించింది. దేశవ్యాప్తంగా ఇది విజయవంతమైంది. కానీ నిన్న ఒక్కరోజే 81 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కరోనా మహమ్మారి బారిన పడ్డ 80 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. అంతేకాదు రైళ్లు, విమానాలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను మార్చి 31 వరకు పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. ఓ విధంగా చెప్పాలంటే కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 'కరోనా వైరస్' ప్రభావం 17 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉంది.
10 నిముషాల్లోనే ''కరోనా వైరస్'' పరీక్ష..!!
'కరోనా వైరస్' కోరలు పీకేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత పకడ్బందీ వ్యూహానికి సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిన జనతా కర్ఫ్యూ ద్వారా మరోసారి దేశవ్యాప్తంగా కఠిన నిర్భంధాన్ని అమలు చేసేందుకు వ్యూహం రచిస్తోంది. అంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తారు. ఐతే లాక్ డౌన్ విధిస్తే నిత్యావసరాలు, ఆస్పత్రులు, మందుల దుకాణాలు మాత్రం తెరిచి ఉంచుతారు.
'కరోనా వైరస్' దెబ్బతో ఇప్పటి వరకు భారత దేశంలో ఏడుగురు మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 14 వేల 613కు చేరింది. నిన్న ఒక్కరోజే 16 వందల మంది చనిపోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కోరలు చాస్తోంది. ఏపీలో రెండో దశకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సౌదీ నుంచి విశాఖకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఆయన కుటుంబంలోని మహిళకు కరోనా వ్యాపించినట్లు తెలుస్తోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..