Covid 19 Cases in India: దేశంలో కొత్తగా 2.71 లక్షల కరోనా కేసులు...

Covid 19 cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతూనే ఉంది. తాజాగా దేశంలో  2,71,202 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2369 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 06:01 PM IST
  • దేశంలో కొత్తగా 2.71లక్షల కరోనా కేసులు
  • కరోనాతో మరో 314 మంది మృతి
  • 7743కి చేరిన కరోనా కేసుల సంఖ్య
Covid 19 Cases in India: దేశంలో కొత్తగా 2.71 లక్షల కరోనా కేసులు...

Covid 19 cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతూనే ఉంది. తాజాగా దేశంలో  2,71,202 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2369 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కరోనాతో మరో 314 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.71 కోట్లకు చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,86,066కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7743కి చేరింది. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28.17 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. నిన్న 16.66శాతంగా నమోదైన పాజిటివిటీ రేటు ఇవాళ 16.28 శాతంగా ఉంది.  కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 42,462 కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఏడాది పూర్తి :

గతేడాది ఇదే రోజున (జనవరి 16) భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ (Covid 19 Vaccination) ప్రారంభమైంది. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్స్‌, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు మాత్రమే వ్యాక్సిన్లు వేశారు. ఆ తర్వాత 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్లు వేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 156.76 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో 18 ఏళ్లు పైబడ్డ దాదాపు 92 శాతం జనాభాకు ఇప్పటివరకూ సింగిల్ డోసు పూర్తయింది. దాదాపు 68 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.

Also Read: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం... రూ.20 కోట్ల ఆస్తి నష్టం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News