Rahul Gandhi Comments: నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆజాద్

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది.

Last Updated : Aug 24, 2020, 02:35 PM IST
Rahul Gandhi Comments: నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆజాద్

Congress Working Committee meeting: న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది. ఎఐసీసీ మాజీ రథసారధి ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)  చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సమావేశంలో పెనుదుమారం చెలరేగింది. అసమ్మతి నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. Also read: Rahul Gandhi: సోనియా ఆస్పత్రిలో ఉంటే లేఖలా.. రాహుల్ గాంధీ ఫైర్! 

దీనిపై గులాం నబీ ఆజాద్ ( Ghulam Nabi Azad )  స్పందిస్తూ.. ఒకవేళ మీరు ఆరోపించినట్లు తాను బీజేపీ ఏజెంట్‌నే అయితే... ఇప్పుడే వెంటనే రాజీనామా చేసి బయటికి వెళ్లిపోతానంటూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము లేఖ రాయడానికి సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలే కారణమని, పార్టీ కోసమే ఇలా చేశామంటూ ఆజాద్ రాహుల్‌తో స్పష్టం చేశారు.

ట్విట్ చేసి.. డిలీట్ చేసిన సిబల్..
ఇదిలాఉంటే.. మరో సీనియర్ నేత, ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మేం బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను నిలబెట్టింది ఎవరు.. మణిపూర్‌లో బీజేపీని దించింది ఎవరు..30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. అయితే.. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్‌లోనే సిబల్‌కు జవాబిచ్చారు. ఇదిలాఉంటే.. ట్విట్ చేసిన కొంతసేపటికే సిబల్ డిలీట్ చేయడం గమనార్హం. Also read: 
India vs China: సైనిక చర్యకు సిద్ధం.. చైనాకు రావత్ వార్నింగ్

Trending News