డీమ్డ్ యూనివర్సీటీ అనే పేరు ఇక చెల్లదు

  

Last Updated : Nov 8, 2017, 02:01 PM IST
డీమ్డ్ యూనివర్సీటీ అనే పేరు ఇక చెల్లదు

భారతదేశంలో ప్రస్తుతం డీమ్డ్ యూనివర్సిటీలుగా చెలమణీ అవుతున్న విద్యాసంస్థలు ఇక "యూనివర్సిటీ" అనే పదాన్ని సంస్థల పేర్లలో వాడకూడదని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఆర్డరును ఒక నెల రోజులలోగా అమలు చేయాలని యూనివర్సీటీ గ్రాంట్ కమీషన్‌కు సూచించింది. 

కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు ఇప్పటికే దూరవిద్య స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తూ.. డిగ్రీలు అందజేయడం పట్ల విముఖత చూపుతూ..అలాంటివి చెల్లవని తెలిపిన సుప్రీం కోర్టు తాజాగా, ఆ విద్యాసంస్థలు "యూనివర్సిటీ" అనే పదం కూడా వాడరాదని కూడా తెలిపింది.

అయితే ఆయా విద్యాసంస్థలు యూజీసీ యాక్టు సెక్షన్ 23 ప్రకారం, యూనివర్సిటీ అనే పదాన్ని వాడకుండా.. సాధారణ డిగ్రీలు అందజేయవచ్చని తెలిపింది.  ప్రస్తుతం భారతదేశంలో 117 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి.

వాటిలో చాలా సంస్థలు ఇప్పటికే ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా అర్హత పొందడానికి కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అలాంటి సందర్భంలో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించడం గమనార్హం.

అయితే ఇదే విషయంపై డీమ్డ్ యూనివర్సిటీల తరఫున కోర్టులో వాదిస్తున్న రవి భరద్వాజ్ అనే న్యాయవాది మాట్లాడుతూ "యూజీసీ యాక్టు, 1956 కు సంబంధించిన పూర్తి వివరాలు సుప్రీంకోర్టు పరిశీలించకుండా ఆర్డరు ఇవ్వడం ఆశ్చర్యకరం. బహుశా డీమ్డ్ యూనివర్సిటీలు ఎటువంటి రెగ్యులజైషన్ లేకుండా పనిచేస్తున్నాయని కోర్టు భావించి ఉండవచ్చు. కానీ అది నిజం కాదు" అని తెలిపారు. 

Trending News