బాలీవుడ్ భామ దీపికా పదుకోణ్ .. తాజా చిత్రం ఛపక్. ఈ సినిమాతో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీపికా నటించిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత వివాదాస్పదంగా మారడమే దీనికి ప్రధాన కారణం. ఈ వివాదాలు అలా పక్కకు పెడితే .. మరోసారి దీపికా పదుకోణ్ టిక్ టాక్ ద్వారా విసిరిన ఛాలెంజ్ వీడియో వివాదాస్పదంగా మారింది. బాలీవుడ్ భామ దీపికా... ఈ మధ్య వివాదాస్పద ప్రకటనలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆమె తాజాగా టిక్ టాక్ ద్వారా ఓ చాలెంజ్ వీడియో రిలీజ్ చేసింది. దీన్ని ఇప్పుడు నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
Acid attack Make-up ?? How low it can get ??
Shame on you !! @deepikapadukone
— Srikanth (@srikanthbjp_) January 18, 2020
టిక్ టాక్ వీడియోలో ఏముంది..?
ఛపక్ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు చేసిన తాజా టిక్ టాక్ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ వీడియోలో ఏముందో అనుకుంటున్నారా..? ఏమీ లేదు.. దీపికా గతంలో తాను నటించిన మూడు ఫేవరేట్ చిత్రాల లుక్స్ ను నెటిజనులు మేకప్ చేసుకుని టిక్ టాక్ వీడియోలు చేయాలి. ఇదీ ఛాలెంజ్. దీనిపై నెటిజనులు గుర్రుమంటున్నారు. దీపికా .. ఇంకా ఎంత కిందకు దిగజారుతావ్.. అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..