Delta Plus Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో అప్పుడే విస్తరించింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)లో అత్యధిక మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెందింది. డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారి భయపెడుతోంది. యూకే, అమెరికా తరువాత ఇప్పుడు ఇండియాలో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.దేశంలో ప్రస్తుతం 48 డెల్టా ప్లస్ కేసులు (Delta plus variant) గుర్తించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 20, తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు గుర్తించారు. ఇక ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్ముకాశ్మీర్, కర్ణాటకల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. కేసుల సంఖ్యను బట్టి పెరుగుతున్న దోరణిని చెప్పలేమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పాజిటివ్ కేసుల్లో 50 శాతానికి పైగా డెల్టా వేరియంట్ (Delta Variant)ఉందని..దీనివల్లే డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చిందని తెలుస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులపై ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్, హర్యానా ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఈ కేసులున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేరియంట్‌లో సంక్రమణ వేగంగా ఉండటం, ఊపిరితిత్తుల్లోని కణాలతో బంధం ఏర్పర్చుకోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకోవడం వంటి లక్షణాలున్నాయి.
Also read: Covid-19 Positive Cases: ఇండియాలో మరోసారి 50వేల పైగా కరోనా పాజిటివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook