న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతను పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓట్ల లెక్కింపుపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 542 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో విజయం సాధించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది.
బీజేపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మరెన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నాయి. అయితే, ఏయే పార్టీకి ఎన్ని స్థానాలు దక్కాయనే పూర్తి వివరాలను ఏఎన్ఐ ఈ ప్రకటనలో వెల్లడించలేదు.