EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి

కరోనా కారణంగా (Coronavirus) ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను (Financial crisis) అధిగమించేందుకు కేంద్రం సైతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్‌డ్రా (Withdraw EPF money) చేసుకోవడం సులభతరం చేసింది. ఈమేరకు గత వారమే కేంద్ర కార్మిక శాఖ ఓ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది.

Last Updated : Apr 10, 2020, 09:34 AM IST
EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి

కరోనా వైరస్ (Coronavirus) కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికంగా ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రభుత్వాలే కాదు.. ప్రజలు సైతం ఆర్థిక ఇబ్బందులతో (Financial crisis) సతమతమవుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజలకు కరోనాతో వచ్చి ఆర్థిక కష్టాలు మాత్రం వీడటం లేదు. ఇలాంటప్పుడు ఇప్పటివరకు దాచుకున్న పొదుపు డబ్బుల్లోంచి కొన్ని ఖర్చు చేయకతప్పదు. అంతేకాదు.. పొదుపు చేసుకున్న డబ్బులు అవసరాలకు సరిపోవు అని అనిపిస్తే.. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఉపసంహరించుకునే (Withdraw EPF money) వెసులుబాటు ఉంది. ఎందుకంటే.. కొన్నిసార్లు పొదుపు చేసుకున్న డబ్బులపై వచ్చే వడ్డీ కంటే.. చేసిన అప్పులు, క్రెడిట్ కార్డులకు పేమెంట్ చేయకపోవడం వల్ల పడే వడ్డీలే అధికంగా ఉంటాయి. అందుకే ప్రావిడెంట్ ఫండ్‌ డబ్బులతో ఆ కష్టాలను గట్టెంకించుకోవచ్చు అనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

Also read : PM Modi about lockdown: లాక్ డౌన్ ఎత్తివేయడంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

కరోనా కారణంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్రం సైతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం సులభతరం చేసింది. ఈమేరకు గత వారమే కేంద్ర కార్మిక శాఖ ఓ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్స్ ఈపీఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకున్న మొత్తంలోంచి 75 శాతం వరకు నగదు లేదా మూడు నెలలకు సమానమైన బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ డబ్బుల్లో ఏది తక్కువైతే.. ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ స్పష్టంచేసింది. 

Also read : Liquor Home delivery: లాక్ డౌన్ సమయంలో మద్యం హోమ్ డెలివరీ

పీఎఫ్ ఖాతాలోంచి నగదు ఎలా ఉపసంహరించుకోవాలి ?
ఇదిగో ఈ లింకు ద్వారా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/. మీ యూనివర్శల్ ఎకౌంట్ నెంబర్ (UAN account) లోకి లాగిన్ అవ్వండి. 
ఆన్‌లైన్ సర్వీసెస్‌లోకి వెళ్లి క్లెయిమ్ ఫామ్‌పై క్లిక్ చేయండి.
క్లెయిమ్ ఫామ్‌పై క్లిక్ చేసిన వెంటనే అది మిమ్మల్ని మీ పీఎఫ్ ఖాతా వివరాలు ఉండే పేజీకి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది.
మీ ఈపీఎఫ్ ఖాతాను వ్యాలిడేట్ చేస్తూ మీ బ్యాంక్ ఎకౌంట్ నెంబర్‌లోని చివరి నాలుగు అంకెలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
అలా ఆ పేజీల అడిగిన వివరాలు పొందుపర్చాలి.
ఆ తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31పై క్లిక్ చేయాలి.
అక్కడ ఓ డ్రాప్‌డౌన్ లిస్ట్ వస్తుంది. ఆ డ్రాప్‌డౌన్‌లోంచి ఔట్‌బ్రేక్ ఆఫ్ ప్యాండెమిక్ కోవిడ్-19 అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
ఆ తర్వాత మీ బ్యాంక్ చెక్ కానీ లేదా బ్యాంక్ పాసు బుక్ వివరాల కానీ అప్‌లోడ్ చేయమని అడుగుతుంది.
ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్ ఆధారంగా జనరేట్ ఓటీపీ (Aadhaar OTP)ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. 
ఈ మొత్తం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగలిగితే.. తర్వాతి మూడు రోజుల్లో మీ ఈపీఎఫ్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News