Gyanvapi Row: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఇప్పుడు టెన్షన్ నెలకొంది. ఏం జరుగుతుందో, ఏమౌతుందోననే ఆందోళన కన్పిస్తోంది. వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతితో పురావస్తు శాఖ సర్వే మొదలెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మొఘలుల కాలంలో మసీదు స్థానంలో హిందూ దేవాలయం ఉండేదని, ఆ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటూ హిందూ మహిళలకు కొంతమంది వారణాసి కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో వివాదం ప్రారంభమైంది. మసీదులో సర్వే జరిపితే వాస్తవం బయటపడుతుందనే పిటీషనర్ల వాదన మేరకు వారణాసి కోర్టు సర్వేకు అనుమతిచ్చింది. అయితే కోర్టు తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాత్కాలిక స్టే విధిస్తూ అలహాబాద్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. న్యాయ పరమైన ప్రయోజనాలకై సర్వే అవసరముందని అలహాబాద్ కోర్టు అభిప్రాయపడింది. సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఇప్పుడు అలహాబాద్ కోర్టు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకు అనుమతిచ్చింది. సెషన్స్ కోర్టు తిర్పును సమర్ధించింది. మసీదు కమిటీ పిటీషన్‌ను కొట్టివేసింది.
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రావడమే ఆలస్యం పురావస్తు శాఖ సిబ్బంది పెద్దఎత్తున మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మసీదు ఆవరణంలో సర్వే ప్రారంభించారు. సర్వే టీమ్ లో 41 మంది అధికారులున్నారు.
మరోవైపు జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మరోవైపు మసీదు ప్రాంగణంలో సర్వే మాత్రం ఇవాళ ఉదయమే ప్రారంభమైపోయింది.
Also read: 429 మందిని మోసం చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఎంపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook