Tamil Nadu: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు సజీవ దహనం

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా కర్మాగారం (crackers factory) లో భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల (Five dead and three injured) పాలయ్యారు.

Last Updated : Oct 24, 2020, 06:09 AM IST
Tamil Nadu: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు సజీవ దహనం

Huge explosion at crackers factory in Tamil Nadu: చెన్నై: తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం (Fire) సంభవించింది. ఓ బాణసంచా కర్మాగారం (crackers factory) లో భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల (Five dead and three injured) పాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ విషాద సంఘటన తమిళనాడులోని విరుధునగర్ జిల్లా (Virudhunagar) ఎరిచ్చనత్తం పరిధిలోని బాణసంచా కర్మాగారంలో చోటుచేసుకుంది. ఎరిచ్చనత్తం పరిధిలోని ఎం.సెన్‌గులం గ్రామంలోగల రాజ్యలక్ష్మి ఫైర్‌వర్క్స్‌ పరిశ్రమలో శుక్రవారం కూలీలంతా బాణసంచా తయారీలో నిమగ్నమై ఉన్నారని.. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయని పోలీసులు (Tamil Nadu Police) తెలిపారు. దీపావళి (deepavali 2020) పండుగ సమీపిస్తుండటంతో.. పరిశ్రమలో బాణసంచా తయారీలో దాదాపు 50 మంది పనిచేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించిందని.. అయితే చాలా మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.  Also read: NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య..కానీ

పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉన్న రసాయనాల కారణంగానే ఈ భారీ ప్రమాదం (fire accident) జరిగినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లతో చేరుకుని అగ్నిమాపక సిబ్బంది రెండుగంటల పాటు కష్టపడి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎరిచ్చనత్తంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డి.కల్లూపట్టి పోలీసులు బాణసంచా పరిశ్రమ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..

Also read: Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News