భారత్‌లో ఒక్కరోజే 2000కు పైగా కరోనా మరణాలు

భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా మరణాలు (India CoronaVirus Cases) సైతం అదే స్థాయిలో ఉండటంతో ఇతర దేశాలను వెనక్కి నెడుతూ కరోనా మరణాల జాబితాలో భారత్ పైపైకి చేరుకుంటుంది. లాక్‌డౌన్ సడలింపులతో మొదలైన కరోనా మరణాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

Last Updated : Jun 17, 2020, 10:52 AM IST
భారత్‌లో ఒక్కరోజే 2000కు పైగా కరోనా మరణాలు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వైరస్ (CoronaVirus India) మహమ్మారి కల్లోలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2000కు పైగా మరణాలు భారత్‌లో సంభవించాయి. 10,974 తాజా కరోనా పాజిటివ్ కేసులు  (CoronaVirus)నమోదు కావడంతో పాటు ఏకంగా 2003 మంది ఒక్కరోజే కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 11,903కు చేరడం ప్రజలను అధికారులతో పాటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి

తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కరోనా (COVID19) పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కు చేరింది. ఇందులో  1,55,227 యాక్టీవ్ కేసులు కాగా, చికిత్స అనంతరం 1,86,935 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజా బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News