Iran Israel War: ఇజ్రాయిల్ పై ఇరాన్ బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు..

Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌.  టెల్‌అవీవ్, జెరూసలెంలను తాకిన ఇరాన్‌ మిసైల్లతో అక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌కు ఇజ్రాయెల్‌ హెచ్చరిక జారీ చేసింది. రాత్రి బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ పౌరులు . దీంతో పశ్చిమాసియాలో ఎపుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలు నెలకొన్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 2, 2024, 08:17 AM IST
Iran Israel War: ఇజ్రాయిల్ పై ఇరాన్ బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు..

Iran Israel War: హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్‌పై  విరుచుకుపడింది. సుమారు 400 క్షిపణులతో ఇజ్రాయెల్‌ భూభాగంపై దాడి చేసింది. రాజధాని టెల్ అవీవ్ సహా ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ పౌరులను బాంబు షెల్టర్లకు వెళ్లాలని ఆదేశించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వార్నింగ్ సైరన్లు మోగించింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరింది.

హెజ్‌బొల్లా, హమాస్‌ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై తాజాగా ఇరాన్‌ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ నగరాలైన టెల్‌అవీవ్, జెరూసలెంపై రాత్రి క్షిపణులతో దాడి చేసింది. వీటిలో చాలావా టిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ దారిలోనే‌ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. హెజ్‌బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ క్షిపణుల ప్రయోగం మొదలు పెట్టడం పశ్చిమాసియాలో యుద్దమేఘాలు నెలకొనేలా చేసింది. ఇరాన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. పదుల సంఖ్యలో బాలిస్టిక్‌ క్షిపణుల్ని వాడినట్లు ఇరాన్‌  అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ హెచ్చరించింది.

ఇరాన్‌ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయెలీలు బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరు రోడ్డు పక్కన రక్షణగా ప్రదేశాలతో పాటు బంకర్స్ లలో దాక్కున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్‌ ఫోన్ల ద్వారా కూడా ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్‌ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తమ దళాలకు ఆదేశాలు జారీచేశారు. ఇరాన్‌ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. దీంతో ఈ పోరు ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని తెలుస్తోంది. మొత్తంగా ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ వార్ తోపాటు పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, ఇరాన్, పాలస్తీనా యుద్దంతో మూడో ప్రపంచ యుద్దం ప్రారంభమైనట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News