India COVID19 Cases : భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా రెండో దశలో వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు కోవిడ్-19 టీకాలు సైతం అందజేసిన భారత్‌లో కరోనా కోరలు చాస్తోంది. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో పాజిటివ్ కేసులు లక్ష దాటడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ తొలి కేసు నమోదైనప్పటి నుంచి భారత్‌లో లక్ష కేసులు ఒకేరోజు నమోదు కాలేదు.
భారత్‌లో తాజాగా గత 24 గంటల్లో 1,03,558 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూ 478 మంది మృతిచెందగా, అదే సమయంలో 52,847 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. నేటి ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 1,16,82,136 మంది కరోనాను జాయించగా, ఇప్పటి వరకు 1,65,101 మంది కోవిడ్19 బారిన పడి మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 1097 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
గత కొన్ని రోజులుగా భారత్‌లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఒకరోజు వ్యవధిలో లక్షకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. గతంలో అమెరికాలో మాత్రమే 24 గంటల్లో లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. చివరగా గత ఏడాది సెప్టెంబర్ 16న అత్యధికంగా 97,894 మంది కరోనా బారిన పడగా, తొలిసారి దేశంలో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Also Read: Gold Price Today 05 April 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు
శీతాకాలంలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి వేసవికాలంలో ఉగ్రరూపం దాల్చుతోంది. ఫిబ్రవరి నెల చివరివరకు ప్రతిరోజూ గరిష్టంగా 15 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కానీ మార్చి నెల ప్రారంభం నుంచి ప్రతిరోజూ అంతకంతకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలు, వేడుకలకు భారీగా జనాలు రావడం సహా భౌతిక దూరం, మాస్కు ధరించడం లాంటి కోవిడ్-19 నిబంధనలు పాటించకపోవడంతో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో ప్రస్తుతం ఏడున్నర లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 05, 2021, ఓ రాశివారికి వాహనయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook