Work From Home: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు తిరిగి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో వెంటాడుతున్న కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంపై శాశ్వత నిర్ణయం తీసుకునే పరిస్థితి కన్పిస్తోంది. వివిధ టెక్ కంపెనీలు ఆ దిశగా యోచిస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)తగ్గడంతో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమై సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ (Delta plus variant)రూపంలో కరోనా థర్డ్‌వేవ్ భయం వెంటాడుతోంది. ఈ తరుణంలో తిరిగి ఆఫీసులకు వెళ్లి పని చేయడం ఎంతవరకూ శ్రేయస్కరమనే చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితులు, వర్క్ ఫ్రం హోంతో కలిగిన లాభనష్టాల్ని కంపెనీలు బేరీజు వేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలైతే వారం ఇళ్లు, వారం ఆఫీసు వంటి హైబ్రీడు విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. కొన్ని సంస్థలైతే పూర్తిగా వర్క్ ఫ్రం హోం ఇస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు, టెక్ స్టార్టప్ కంపెనీలు హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ ప్రారంభించాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. రానున్న 12-24 నెలల వరకూ దేశంలోని 50 కోట్ల వర్క్ ఫోర్స్‌లో 20 శాతం ఇళ్ల నుంచే పనిచేసే అవకాశాలున్నట్టు ఓ సర్వేలో తేలింది.
మరోసారి కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) వచ్చినా రాకపోయినా..పర్మినెంట్ రిమోట్ వర్కింగ్ విధానం లేదా సుదీర్ఘకాలం వర్క్ ఫ్రం హోం ఇచ్చేందుకు ఇప్పటికే 30 కంపెనీలు సిద్ధమయ్యాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులకు వచ్చే యేడాది సెప్టెంబర్ 6 వరకూ ఇంటి నుంచి పనిచేసుకోవచ్చని తెలిపింది. అమెజాన్ వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చింది. అట్లాసియన్, ఫేస్‌బుక్ సంస్థలైతే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారంలో 50 శాతం ఇంటి నుంచి పనికి అనుమతిచ్చింది. అటు ఇన్ఫోసిస్ కూడా 33 శాతం ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం(Work From Home)కల్పించింది.
Also read: Uttar pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకై రంగంలో దిగిన ప్రియాంక గాంధీ, లక్నోలో బస
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook