కాదేదీ కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. అలాగే కళకు పనికి రానిదంటూ ఏదీ రాదంటూ నిరూపిస్తున్నాడు ఈ జమ్మూ కాశ్మీర్ యువకుడు. సృజనాత్మత ఉండాలే కానీ మంచు ముద్దను కూడా మంచి బొమ్మలా మలచవచ్చని నిరూపిస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈ యువకుని పేరు జుబేర్ అహ్మద్. శ్రీనగర్ లో నివసిస్తున్న ఈ యువకుడు తనలోని సృజనాత్మతకు పదును పెట్టాడు. జమ్మూ కాశ్మీర్ లో ఈ సీజన్ లో ఎటు చూసినా మంచే కనిపిస్తుంది. దీన్నే తనలోని కళకు ముడి సరుకుగా ఎంచుకున్నాడు. మంచుతో శిల్పాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతడు చేసిన స్నో కార్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. అచ్చం నిజమైన కారులో కనిపిస్తోంది కదూ. మంచు ముద్దతో అందంగా కారును మలిచి.. దానికి కలర్స్ కూడా అద్దాడు. స్థానికులు, పర్యాటకులు ఈ కారును చూసి మంత్రముగ్దులవుతున్నారు. 'కారు ఎంత బాగా చేశావ్ రా బాబూ' అంటూ మెచ్చుకుంటున్నారు.
Read Also: ఉత్తరాఖండ్‌లో హిమపాతం చూశారా..?
చిన్నప్పటి నుంచే చేస్తున్నా..
తను ఇలాంటి మంచు శిల్పాలను చిన్నప్పటి నుంచే చేస్తున్నానని జుబేర్ చెబుతున్నాడు. వనరులు కల్పిస్తే .. మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తానంటున్నాడు. మంచు ముద్దలతో ఎలాంటి శిల్పాలనైనా చెక్కి చూపిస్తానని చెబుతున్నాడు. స్నో కారు లాంటివే కాకుండా తాజ్ మహల్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ అద్బుత కట్టడాలు కూడా మంచు శిలల్లో మెరిసే విధంగా రూపొందించగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..