Video: ఫెయిల్ చేశాడని.. మ్యాథ్స్ టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు...

Teacher Thrashed by Students: పరీక్షల్లో తమ ఫెయిల్ చేశాడనే ఆగ్రహంతో ఓ టీచర్‌పై విద్యార్థులు దాడి చేసిన ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 1, 2022, 09:07 AM IST
  • జార్ఖండ్‌లో టీచర్‌పై దాడి
    ఫెయిల్ చేసినందుకు చెట్టుకు కట్టేసి కొట్టిన స్టూడెంట్స్
    సోషల్ మీడియాలో వీడియో వైరల్
 Video: ఫెయిల్ చేశాడని.. మ్యాథ్స్ టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు...

Teacher Thrashed by Students: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఉన్న ఓ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. ప్రాక్టికల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి తమను ఫెయిల్ చేశారనే కారణంతో ఒక ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ క్లర్క్‌ను చెట్టుకు కట్టేశారు. స్కూల్ ప్రాంగణంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (జేఏసీ) ఇటీవల తొమ్మిది తరగతి ఫలితాలను వెలువరించింది. ఈ ఫలితాల్లో దుమ్కా జిల్లాలోని గోపీకందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ స్కూల్‌కి చెందిన 11 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మొత్తం 32 మంది విద్యార్థుల్లో 11 మందికి 'డీడీ(డబుల్ డీ)' గ్రేడ్ కేటాయించారు. ఈ గ్రేడ్ వచ్చిందంటే ఫెయిల్ అని అర్థం.

ఆన్‌లైన్‌లో ఈ ఫలితాలు చూసిన విద్యార్థులు.. మ్యాథ్స్ టీచర్ తమకు తక్కువ మార్కులు వేయడం వల్లే పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని భావించారు. తక్కువ మార్కులు వేసినందుకు ఆ టీచర్‌ను, ఆ ఫలితాలను జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (జేఏసీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినందుకు స్కూల్ క్లర్క్‌ను విద్యార్థులు చెట్టుకు కట్టేసి దాడి చేశారు. 

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అసలు తొమ్మిది తరగతి ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయా లేదా అనేది తెలియదు. విద్యార్థులు తాము ప్రాక్టికల్ పరీక్షలో ఫెయిలయ్యామని దాడి చేశారా.. లేక రాతపూర్వక పరీక్షలో ఫెయిలయ్యామని దాడి చేశారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. జేఏసీ సైట్‌లో అప్‌లోడ్ అయిన ఫలితాల్లో తేదీ పేర్కొనలేదు. దీంతో విద్యార్థులు రూమర్స్‌ని నమ్మి ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఈ ఘటన గురించి తెలిసి పోలీసులు స్కూల్‌కి వెళ్లి ఆరా తీశారు. అయితే దాడికి గురైన ఉపాధ్యాయుడు, క్లర్క్ గానీ స్కూల్ యాజమాన్యం గానీ ఈ ఘటనపై ఫిర్యాదుకు విముఖత వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. 

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. గడిచిన 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా...  

Also Read: India vs Hong Kong : పసికూన హాంకాంగ్‌పై టీమిండియా ఘనవిజయం.. చితక్కొట్టిన సూర్య కుమార్ యాదవ్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News