Jodhpur Communal Violence: జోద్‌పూర్‌లో రేపు రాత్రి వరకు కర్ఫ్యూ పొడింపు

Jodhpur Communal Violence: రాజస్థాన్‌లో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. రంజాన్‌ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో జోద్‌పూర్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దీంతో జోద్‌పూర్‌లో కర్ఫ్యూ రేపు అర్థరాత్రి వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 02:18 PM IST
  • జోద్‌పూర్‌లో కర్ఫ్యూ పొడిగించిన పోలీసులు
  • జోద్‌పూర్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసుల వెల్లడి
  • కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు
Jodhpur Communal Violence: జోద్‌పూర్‌లో రేపు రాత్రి వరకు కర్ఫ్యూ పొడింపు

Jodhpur Communal Violence: రాజస్థాన్‌లో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. రంజాన్‌ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో జోద్‌పూర్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దీంతో జోద్‌పూర్‌లో కర్ఫ్యూ రేపు అర్థరాత్రి వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లను కర్ఫ్యూ నుంచి మీనహాయింపు ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు..లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌ ఉందని పోలీసులు వెల్లడించారు. అల్లర్లకు బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కరౌలి, జోధ్‌పూర్, రామ్‌గఢ్‌లలో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. మేము సకాలంలో చర్యలు తీసుకున్నాము, ఈ కారణంగా చిన్న సంఘటనలు మిగిలి ఉన్నాయి. 

జోద్‌పూర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత
జోద్‌పూర్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్‌ ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. శాంతి భద్రతలను సమీక్షించ తర్వాతనే ఇంటర్నెట్‌ సేవలను పునఃప్రారంభిమస్తామని పోలీస్‌ అధికారులు వెల్లడించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

కర్ఫ్యూ నుంచి ఎవరికి మినహాయింపు
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు పోలీసులు. అలాగే వైద్యశాఖకు సంబంధించిన సిబ్బంది, బ్యాంక్‌, న్యాయ అధికారులు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మీనహాయింపు ఉంది. రంజాన్‌కు కొన్ని గంటల ముందు చెలరేగిన హింసాత్మక ఘటనలో 140 మందిని అరెస్ట్ చేసి 14 కేసులు బుక్‌ చేశారు  పోలీసులు. ప్రస్తుతం జోద్‌పూర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్‌ అధికారులు చెప్పారు.

కర్ఫ్యూకు దారితీసిన ఆందోళన
మంగళవారం ఈద్‌కు గంటల ముందు సీఎం అశోక్ గెహ్లాట్ స్వస్థలం జోధ్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఉద్రికత్తల నేపథ్యంలో అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జోద్‌పూర్‌ పరిధిలోని 10 పోలీసు స్టేషన్లలో కర్ఫ్యూ విధించారు. జోధ్‌పూర్‌లోని జలోరీ గేట్ సర్కిల్‌పై మతపరమైన జెండాలు పెట్టడంపై ఆందోళన జరిగింది. ఇది రాళ్లదాడికి దారితీసింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. శాంతి, సామరస్యాలను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

జోద్‌పూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి..కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భారీగా మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈద్గా వద్ద ప్రార్థనల తర్వాత ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. జలోరీ గేట్ సమీపంలో దుకాణాలు, వాహనాలు, ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. పరశురామ జయంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కాషాయ జెండా కనిపించకుండా పోయిందని ఇతర వర్గాలకు చెందిన వారు ఆరోపించడంతో ఘర్షణకు దారి తీసింది. రాళ్లదాడి, ఘర్షణలకు దారితీసిందని అధికారులు తెలిపారు. హింసా చెలరేగంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. పుకార్ల వ్యాప్తిని అరికట్టేందుకు ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 

జోధ్‌పూర్‌లో చెలరేగిన హింసస్మాతక ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. హింసకు పాల్పడిన వారిపై మతం, కులం, వర్గాలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. జోధ్‌పూర్‌లో బీజేపీ మత హింసను ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు.

Also Read: Political Heat In Telangana: తెలంగాణలో జాతీయ నేతల టూర్లు..మొదలైన ఎన్నికల జాతర

Also Read: Skin Glow With Egg: గుడ్డుతో ముఖం మెరిసిపోతుందా? ఉపయోగించడానికి సరైన పద్ధతులను తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News