నాల్గో విడుత పోలింగ్ షురూ; ఓటేసేందుకు క్యూకట్టిన జనాలు

ఎన్నికల షెడ్యూల ప్రకారం లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నాల్లో విడుత పోలింగ్ ప్రారంభమైంది.

Last Updated : Apr 29, 2019, 08:02 AM IST
నాల్గో విడుత పోలింగ్ షురూ; ఓటేసేందుకు క్యూకట్టిన జనాలు

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నాల్గో విడుత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దఫ మొత్తం 9 రాష్ట్రాల్లో 71 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద  భారీ గా క్యూకట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ గడువు ముగుస్తుంది.

ఎన్నికలు జరిగే స్థానాలు..

మహారాష్ట్రలో 17 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా ...రాజస్థాన్ లో 13, యూపీ 8, పశ్చిమ బెంగాల్ లో 8 , మధ్యప్రదేశ్ లో 6, ఓడిషా లో 6 , బీహార్ లో 5 , జార్ఖండ్ లో 3 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్ సభకు సైతం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దఫ ఎన్నికలతో మహారాష్ట్ర, ఒడిషాలో ఎన్నికలు పూర్తికానున్నాయి.

మూడో వంతు ఎన్నికలు పూర్తి

నాల్గో దశ పోలింగ్ లో భాగంగా  71 లోక్ సభ స్థానాల్లో జరిగే ఈ ఎన్నికల్లో మొత్తం 945 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  తొలి మూడు దశల్లో 302 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఎన్నికలు పూర్తయితే 373 స్థానాల్లో ఎన్నికలు పూర్తయినట్లువుతుంది. అంటే దాదాపు 70 శాతం పోలింగ్ ప్రక్రియ పూర్తయినట్లుగా భావించవచ్చు

Trending News