Maharashtra assembly election 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడా, విదర్భ, కొంకణ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో మహా యుతి, కాంగ్రెస్ నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ మధ్య పోరు హోరా హోరీగా ఉండనుంది. మరోవైపు మహాయుతిలో శివసేన శిండే గ్రూపుతో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ అజిత్ పవార్ గ్రూపు ఉంది. వీళ్లకు ఆయా పార్టీలకు చెందిన గుర్తులు దక్కడం విశేషం. మరోవైపు మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ పార్టీతో పాటు శివసేన ఉద్థద్ ఠాక్రేతో పాటు .. శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల బరిలో దిగుతున్నాయి. మొత్తంగా 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రాలో ఎంఐఎమ్, ఎంఎన్ఎస్, బహుజన్ వంచిత్ అఘాడీతోపాటు మరాఠ్వాడకు చెందిన చిన్నా చితక పార్టీలు రంగంలోకి దిగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 9 కోట్ల 63 లక్షలమంది ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. మొత్తం 1,000,186 పోలింగ్ బూత్‌లు, 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక బీజేపీ 149 సీట్లు..శివసేన..81 సీట్లు.. ఎన్సీపీ 59 సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏలో కాంగ్రెస్ . 101, శివసేన (ఉద్దవ్).. 95, ఎన్సీపీ (శరత్ పవార్) 86 సీట్లో పోటీ చేస్తున్నాయి. మొత్తంగా 288 స్థానాల్లో 4136 మంది బరిలో ఉన్నారు.
చిన్న పార్టీలు ఎవరి పుట్టి ముంచనున్నాయో చూడాలి. ఈ రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 26న ముగయనుంది. మరో వైపు జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడతలో 38 స్థానాలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇందులో 18 సంతాల్ పరిగణలో ఉంటే.. 18 చోటా నాగ్ పూర్ జిల్లాలో ఉన్నాయి. ఇందులో 8 షెడ్యూల్ ట్రైబ్స్ కు రిజర్వ్ అయ్యాయి. మరో 3 స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తంగా రెండో విడతలో 81 స్థానాలకు ఎన్నికలు పూర్తువుతాయి. ఈ సారి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తో సానుభూతి పవనాలు వీస్తాయా లేదా అనేది చూడాలి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు అవసరం. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 సీట్లు రావాలి. అక్కడ జార్ఖండలో బీజేపీ నేతృత్వంలోని కూటమితో పాటు కాంగ్రెస్, జేఎంఎం మరో కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. బీజేపీలోకి బాబులాల్ మరాండీ, చంపాయ్ సోరెన్ ఎన్నికల ముందు చేరడం ఆ పార్టీకి నైతికంగా బలం చేకూరింది. జార్ఖండ్ ఎన్నికల గడువు జనవరి 5న ముగియనుంది. మొత్తం 2.86 కోట్ల ఓటర్లున్నారు. 38 స్థానాలకు గాను 528 మంది బరిలో ఉన్నారు. వారిలో 472 మంది పురుషులు,.. మహిళలు.. 55, ట్రాన్స్ జెండర్స్ ఒకరు బరిలో ఉండటం విశేషం. 14,218 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 15 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 9 సీట్లు.. పంజాబ్ లో 4 సీట్లు.. కేరళలో పాలక్కాడ్ సీటు..ఉత్తరాఖండ్ లో 1 సీటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23 శనివారం రోజున ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి. మరి మహారాష్ట్రలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter