Mumbai Building Collapse: గత రెండు రోజులుగా మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటచేసుకుంది. ముంబైలోని మలాద్ మురికవాడలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ముంబై (Mumbai)లోని మలాద్ మురికివాడలో జరిగింది. ఓ భవనం పక్కనే ఉన్న మరో భవనంపై కుప్పకూలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ముంబై పురపాలక సంస్థ బీఎంసీ సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం బీడీబీఏ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు సైతం సహాయక చర్యలలో సిబ్బందికి సహకరిస్తున్నారని బీఎంసీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
Also Read: Good news for farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలకు MSP పెంచిన కేంద్రం
Maharashtra: Search and rescue operation continues in New Collector compound, Malad West of Mumbai, where residential structures collapsed last night. 11 people died, 7 injured.
Visuals from the spot, this morning. pic.twitter.com/ct7HhErNHF
— ANI (@ANI) June 10, 2021
బీజేపీ (BJP) అధికార ప్రతినిధి రామ్ కదమ్ ఈ ప్రమాదంపై స్పందించారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ మాట్లాడుతూ.. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం కూలిపోయిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి భవనాల సమీపంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి చేర్చామన్నారు.
Also Read: Solar Eclipse 2021 Date, Timings: తొలి సూర్య గ్రహణం 2021, జూన్ 10న ఆకాశంలో అద్భుతం, Ring of Fire
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook