చంద్రుడి వద్దకు మీ పేరు పంపించండి

మొదటిసారి ప్రైవేటు అంతరిక్ష నౌకను చంద్రుడికి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది బెంగళూరు ఆధారిత ప్రవేట్ సంస్థ టీం ఇండస్.

Last Updated : Feb 5, 2018, 08:32 PM IST
చంద్రుడి వద్దకు మీ పేరు పంపించండి

బెంగుళూరు ఆధారిత ప్రైవేటు సంస్థ టీంఇండస్, మొదటిసారి ప్రైవేటు అంతరిక్ష నౌకను చంద్రుడి వద్దకు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధులు విద్యార్థుల ఫెస్టివల్ ప్రమాణ-2018లో భాగంగా గీతం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. స్టూడెంట్స్ ను కలిసి, కొంత రుసుము చెల్లించి  అంతరిక్ష నౌక మీద వారి పేర్లు ముద్రించుకోవచ్చని చెప్పారు. ఆసక్తిగలవారు మార్చి 2019లో జరిగే అంతరిక్ష నౌక ప్రయోగాన్ని వీక్షించవచ్చు అని, కానీ కొంత డబ్బు చెల్లించాలని చెప్పారు.

స్పేస్ మిషన్ కి నిధులు సమకూర్చడానికి కంపెనీ ఇలాంటి పద్ధతులని చేపడుతుందని టీంఇండస్ ప్రతినిధి మ్రిగంక్ సహై చెప్పారు. టీంఇండస్ 20 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఉన్న గూగుల్ లూనార్ ఎక్స్ ప్రైజ్ పోటీలో పాల్గొందన్నారు. అంతరిక్ష నౌకను తయారు చేయడానికి 80 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అంతరిక్ష నౌక మీద పేర్లు ముద్రించాలనుకునే ఆసక్తిగలవారు moonshot@teamindus.inని సంప్రదించవచ్చని అన్నారు.

180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే, చంద్రుడి వాతావరణాన్ని తట్టుకునే విధంగా, తేలికైన క్రాఫ్ట్ ని టీంఇండస్ రూపొందిస్తున్నట్లు సహై తెలిపారు. మాజీ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలతో సహా 100 మంది బృందం ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తోంది. సామాగ్రి కోసం ఫ్రాన్స్, జపాన్, జర్మనీలో ఉన్న కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం" అన్నారు. ఈ అంతరిక్ష నౌక చంద్రుడిపై 500 మీటర్లు ప్రయాణించి స్పష్టమైన చిత్రాలను, వీడియోలను, సమాచారాన్ని భూమి మీదకు చేరవేసేలా రూపొందిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన వారిలో రతన్ టాటా, నందన్ నిలేకని, కిరణ్ మజుమ్దర్ షా, ఆశిష్ కచోలియా, రాకేష్ ఝున్ ఝున్ వాలా, రాజీవ్ మోదీ లాంటి ప్రముఖులు ఉన్నారు.

Trending News