మా కూతురు తిరిగిరాదు.. ఆమె ఆత్మ శాంతిస్తుంది: నిర్బయ తల్లి Asha Devi

ఎట్టకేలకు ఆ కామాంధులను శిక్షించారు. సుదీర్ఘకాలం ఇందుకోసం పోరాటం చేశాం. చివరికి ఈరోజు మాకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశా దేవి అన్నారు.

Last Updated : Mar 20, 2020, 08:41 AM IST
మా కూతురు తిరిగిరాదు.. ఆమె ఆత్మ శాంతిస్తుంది: నిర్బయ తల్లి Asha Devi

న్యూఢిల్లీ: ఏడేళ్ల కిందట ఢిల్లీలో మెడికల్ స్టూడెంట్ నిర్బయ సామూహిక అత్యాచారం, హత్యకేసులో దోషులకు ఎట్టకేలకు శిక్ష అమలుచేశారు. చివరివరకు పిటిషన్లతో కాలయాపన చేసినా చివరికి న్యాయం గెలిచిందంటూ నిర్బయ నిందితులను ఉరితీయడంపై నిర్భయ తల్లి ఆశా దేవి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మా కూతురు ఎలాగూ ప్రాణాలతో లేదు, ఆమె ఎన్నటికీ తిరిగిరాదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె చనిపోయిన రోజు నుంచి పోరాటం చేస్తే ఇన్ని రోజులకు న్యాయం జరిగిందన్నారు. నీకు న్యాయం జరిగిందని చెబుతూ కూతురు నిర్భయ ఫొటోను గుండెలకు హత్తుకున్నానని చెప్పారు.

డిసెంబర్ 16, 2012.. నిర్భయ ఘటన రోజు ఏం జరిగింది?

నిర్భయ కేసులో నలుగురు దోషులు ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను ఉరితీసిన అనంతరం ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ‘ఎట్టకేలకు ఆ కామాంధులను శిక్షించారు. సుదీర్ఘకాలం ఇందుకోసం పోరాటం చేశాం. చివరికి ఈరోజు మాకు న్యాయం జరిగింది. ఈరోజును దేశంలోని ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నాం. ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. సుప్రీంకోర్టు నుంచి ఇంటికి వెళ్లి ఈరోజు నీకు న్యాయం జరుగుతుందని నా కూతురికి చెప్పానంటూ’ నిర్భయ తల్లి ఆశాదేవి భావోద్వేగంతో మాట్లాడారు.

నిర్భయ దోషులను ఉరితీసిన తిహార్ జైలు అధికారులు

తమ పోరాటం ఇంతటితో ఆగిపోలేదని, ఈ తీర్పుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇలాంటి కేసుల్లో న్యాయం కోసం తాము పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ చివరికి తన కుమార్తెకు న్యాయం జరిగిందని.. నిందితుల ఉరితో ఆమె ఆత్మకి శాంతి చేకూరుతుందన్నారు. కాగా, నేటి ఉదయం తిహార్ జైలులో నిర్భయ కేసులో నలుగురు దోషుల్ని తలారీ పవన్ జల్లాద్ ఉరితీసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఉరిశిక్షపై హర్షం వ్యక్తమవుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News