Mobile Phones Usage In Office: ఆఫీసులో ఉద్యోగులు ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

Madras High Court on mobile usage in offices: తిరుచిరాపల్లిలోని హెల్త్‌ రీజనల్‌ వర్క్‌షాప్‌ విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో సహచర ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్‌ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 07:59 PM IST
Mobile Phones Usage In Office: ఆఫీసులో ఉద్యోగులు ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

Madras High Court on mobile usage in offices: మొబైల్ ఫోన్ ప్రస్తుతం కనీస అవసరంగా మారింది. దాదాపుగా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉన్న పరిస్థితి నెలకొంది. మొబైల్ లేకుండా గడపలేని పరిస్థితి ఉంది. మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్టు ధర్మాసనం షాకిచ్చింది. ఆఫీసు పనివేళల్లో ఉద్యోగులు వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్‌ ఫోన్స్‌ను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.  

తిరుచిరాపల్లిలోని హెల్త్‌ రీజనల్‌ వర్క్‌షాప్‌ విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో సహచర ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్‌ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది. కార్యాలయాల్లో 
సెల్ ఫోన్లు వినియోగిస్తుండటం, ఫోన్లలో వీడియోలు తీయడం ఇటీవల ఎక్కువైందన్నారు. దీంతో తోటి ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగించడమే గాక, ప్రభుత్వ ఆఫీసుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు కనీస క్రమశిక్షణ పాటించాలని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం సూచించింది. మొబైల్‌ ఫోన్లను వీలైతే స్విఛాఫ్‌ చేయాలని లేదంటే వైబ్రేషన్‌, సైలెంట్‌ మోడ్‌లో (Mobile Phones Usage) పెట్టాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకుని ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లి మాట్లాడి రావాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్క్యులర్‌ జారీ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.

Also read : Leopard Vs Python Video: కొండచిలువపై దాడి చేసిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

Also read : Thirsty Snake: చేతులతో పాము దాహం తీర్చిన వ్యక్తి - వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News