Agriculture bills in Rajya Sabha: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత స్వరం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ (parliament) లో బిల్లును ప్రవేశ పెట్టిన అనంతరం ఈ వ్యవసాయ బిల్లులను కేంద్రం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యలు ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ.. బిల్లులను ఆమోదింపజేసే ప్రక్రియను అడ్డుకున్నారు. సభ మధ్యాహ్నం 1గంటకు పూర్తి కావాల్సిన నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ బిల్లులపై ఓటింగ్‌కు పిలిచారు. దీంతో విపక్ష సభ్యులందరూ చైర్మన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. Also read: Agriculture Bills: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు
వ్యవసాయ బిల్లుల సవరణలపై సభ్యుల వివరణ తీసుకోకుండానే వాయిస్ ఓటుకు ఎలా వెళ్తారంటూ.. బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షపార్టీల సభ్యులందరూ పోడియం చుట్టూ చేరి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడగా.. డిప్యూటీ చైర్మన్ కొన్ని నిమిషాలు వాయిదా వేసి మరలా ప్రారంభించారు. MSK Prasad Trolls: అంబటి రాయుడు అదరహో.. ఎమ్మెస్కే ప్రసాద్‌పై 3D రేంజ్లో ట్రోలింగ్