12 రోజుల్లో రూ.3 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Last Updated : May 25, 2018, 05:31 PM IST
12 రోజుల్లో రూ.3 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. కర్ణాటకలో ఎన్నికలకు ముందు 19 రోజులపాటు ధరల సమీక్ష చేపట్టని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ధరలను ఏ రోజుకు ఆ రోజుకు సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం రోజూవారీగా చేపట్టిన ధరల సమీక్షలో భాగంగా వరుసగా 12వ రోజైన శుక్రవారం సైతం పెట్రోలు, డీజిల్ ధరలు పైకి ఎగబాకాయి. అలా గడిచిన 12 రోజులలో పెట్రోల్ లీటర్ కి రూ.3.20 పెరగగా డీజిల్ ధర లీటర్ కి రూ2.82 పెరిగింది. ఈ ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 77.83 వుండగా లీటర్ డీజిల్ ధర రూ.68.75 గా వుంది. 

దేశంలోని మరో మూడు ప్రధాన మెట్రో నగరాలైన కోల్‌కతా, ముంబై, చెన్నైలలో మే నెల 13వ తేదీ నుంచి పెరిగిన, ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా వున్నాయి.

      కోల్‌కతా     ముంబై   చెన్నై
ప్రస్తుతం పెట్రోల్ (లీ) (రూపాయల్లో)     80.47      85.65     80.80
పెట్రోల్ ధర పెంపు (లీ)        3.15     3.17     3.37
ప్రస్తుతం డీజిల్ (లీ)     71.30       73.20      72.58 
డీజిల్ ధర పెంపు (లీ)     2.82     2.67     3.02

 

Trending News