PM Narendra Modi | న్యూఢిల్లీ: భారత్‌లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వందశాతం సురక్షితమని అందుకే అనుమతినిచ్చినట్లు డీజీసీఐ (GGCI) చీఫ్ వీజీ సోమాని (VG Somani) మీడియాకు వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) స్పందించారు. ఈ మేరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institue of India), హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ (Bharat Biotech) ను అభినందిస్తూ వరుస ట్విట్లు చేశారు. Also Read: COVID-19 Vaccine: కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌కు డీజీసీఐ గ్రీన్ సిగ్నల్
భారత్ త్వరలోనే కోవిడ్ రహితం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీరమ్ ఇండియా, భారత్ బయోటెక్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి మంజూరు చేయడంతో ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్స్‌ను అభినందిస్తూ.. ప్రధాని భారతీయులందరికీ అభినందనలు తెలిపారు.
A decisive turning point to strengthen a spirited fight!
DCGI granting approval to vaccines of @SerumInstIndia and @BharatBiotech accelerates the road to a healthier and COVID-free nation.
Congratulations India.
Congratulations to our hardworking scientists and innovators.
— Narendra Modi (@narendramodi) January 3, 2021
అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారు కావడం ప్రతి భారతీయునికి గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. దీనిద్వారా ఆత్మనిర్భర్ భారత్ (స్వయం సమృద్ధి భారతదేశం) కోసం కంటున్నకలలను (Atmanirbhar Bharat) నిజం చేయడానికి మన శాస్త్రవేత్తలు ఎంత శ్రమిస్తున్నారో (Narendra Modi) తెలుస్తోందని తెలిపారు. Also Read: Heavy Rain In Delhi: దేశ రాజధానిని వణికిస్తున్న చలి, వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook