Rajasthan: కోటా లో టెన్షన్.. టెన్షన్.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న మరో విద్యార్థి..

Kota News: కోటాలోని బోర్ఖెడా ప్రాంతానికి చెందిన నిహారిక సింగ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) కోసం సిద్ధమవుతుండగా, తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

Last Updated : Jan 29, 2024, 03:14 PM IST
  • కోెెటా లోని బోర్ఖెడా ప్రాంతానికి చెందిన నిహారిక సింగ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) కోసం సిద్ధమవుతుండగా, తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో నిర్వాహకులు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, యువతిని ఆస్పత్రికి తరలించారు.
Rajasthan: కోటా లో టెన్షన్.. టెన్షన్..  సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న మరో విద్యార్థి..

Kota Stundent Commits Suicide: రాజస్థాన్ లోని కోటా లో అనేక మంది విద్యార్థులు JEE,  NEET ఎగ్జామ్స్ లకు సిద్ధమవుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ర్యాంక్ రావాలని, కోటాలో చేర్పించి మరీ చదివిస్తుంటారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కూడా విద్యార్థులకు అంతే సీరియస్ గా క్లాసులు తీసుకుని, ఎగ్జామ్ లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు కోచింగ్ సెంటర్, క్లాసులో ఎగ్జామ్స్ ల ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు.

కొందరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మరో విద్యార్థిని ఎగ్జామ్ ఒత్తిడిని భరించలేక సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. కోటలోని బోర్ఖెడా ప్రాంతానికి చెందిన నిహారిక సింగ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) కోసం సిద్ధమవుతుండగా, తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో నిర్వాహకులు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, యువతిని ఆస్పత్రికి తరలించారు.

Read Also: అమెరికాలో దారుణం.. భారత సంతతి యువకుడిపై 50 సార్లు సుత్తితో దాడి.. అసలేం జరిగిందంటే..?

విద్యార్థినిని టెస్ట్ చేసిన వైద్యులు ఆమెను అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.  దీంతో విద్యార్థిని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.  ఈక్రమంలో.. నిహారిక రాసిన సూసైడ్ నోట్ వైరల్ గా మారింది. "మమ్మీ, పాపా, నేను JEE చేయలేను... అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను ఓడిపోయాను..  నేను మీకు చెడ్డపేరు తీసుకొచ్చాను.. నన్ను  క్షమించండి మమ్మీ, పాపా అంటూ లేఖను రాసింది. 

పోలీసుల కథనం ప్రకారం, నిహారిక తన తండ్రి, బ్యాంకు ఉద్యోగితో కలిసి నివసిస్తుంది.  పోటీ పరీక్షల ఒత్తిడితో ఇంటర్ చదువుతుంది.  ప్రతి రోజు  ఏడెనిమిది గంటలు కష్టపడి చదివిన కూడా.. ఆమె సరిగ్గా రాలేకపోయాయని తీవ్రంగా బాధపడి సూసైడ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ దురదృష్టకర సంఘటన కోటాలో మరొక కోచింగ్ విద్యార్థి మహ్మద్ జైద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన జైద్ నీట్ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు.

గత సంవత్సరం, విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడంతో, కోచింగ్ విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. డిప్రెషన్,  ఒత్తిడి నుండి విద్యార్థులను రక్షించడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు,  జిల్లా పరిపాలనలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అయితే, ఈ చర్యల ప్రభావం చర్చనీయాంశంగా ఉంది.

కోటా మెడికల్ కాలేజీలోని సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ భరత్ సింగ్ షెకావత్ గత సంవత్సరం మాట్లాడుతూ, విద్యార్థుల ఆత్మహత్యల ప్రమాదకర పెరుగుదలను పరిష్కరించడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు తల్లిదండ్రుల విధానంలో సమగ్ర మార్పు అవసరమని అన్నారు. JEE,  NEET వంటి పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు కోటాలో విద్యార్థులు జాయిన్ అవుతుంటారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News