Bengaluru Rameshwaram Cafe Blast CCTV: కర్ణాటకలో రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడుతో దేశ వ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న.. కేఫ్ ప్రాంతంలోని ప్రతిసీసీ కెమెరాను పరిశీలించారు. దీంతో ఒక యువకుడు బ్యాగ్ తీసుకుని కేఫ్ లోకి ప్రవేశించాడు. ఆతర్వాత.. అతగాడు కాసేపు అక్కడే కూర్చుని టిఫిన్ తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతగాడు వెళ్లిపోయిన కాసేటికి పేలుడు సంభవించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. రామేశ్వరం కేఫ్ స్థానికంగా ఎంతో ఫెమస్. ఇక్కడకు టీ, స్నాక్స్ తినడానికి నిత్యం వందల మంది కస్టమర్లు వస్తుంటాయి. ఇక్కడ ఎప్పుడు చూసిన కేఫ్ కస్టమర్లతో రద్దీగా ఉంటుంది.
Bengaluru cafe blast suspect caught on CCTV. Wearing a cap 👇#RameshwaramCafe#BengaluruBlast pic.twitter.com/NjlnEiAOzL
— Stranger (@amarDgreat) March 2, 2024
ఈ నేపథ్యంలోనే నిన్న (శుక్రవారం) నాడు కూడా కస్టమర్లు కేఫ్ లో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కేఫ్ లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్త సిక్తంగా మారిపోయింది. వెంటనే కేఫ్ సిబ్బంది, కస్టమర్లు భయంతో పరుగులు పెట్టారు. దాదాపు.. పదుల సంఖ్యలో అక్కడున్న వారు గాయపడినట్లు తెలుస్తోంది.
వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు, యాంటీ బాంబు స్క్వాడ్ చేరుకున్నారు. అంతే కాకుండా.. అక్కడున్న క్లూస్ ను సేకరించారు. ఘటన జరిగిన ప్రదేశం చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. దీనిలో ఒక యువకుడు బ్యాగ్ పట్టుకుని వచ్చి, కేఫ్ లో పెట్టేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య, బీజేపీ ఎంపీ ఉగ్రకోణం ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.
పోలీసులు నిందితుడి ఊహచిత్రాన్ని విడుదల చేశారు. ఘటనపై పోలీసులు.. ఉపా చట్టం కింద కేసును నమోదు చేశారు. సంఘటన జరిగిన ప్రదేశానికి ఎన్ఐఏ, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని అక్కడి సాంపుల్స్ ను సేకరించారు. ఈ ఘటనతో దేశంలో అనేక చోట్ల పోలీసులు హైఅలర్ట్ ను ప్రకటించాయి.
Read More: Mango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..
సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎంపీ ఎన్నికలకు ముందకు ఇలాంటి బాంబు పేలుడు ఘటన జరగటం అటు రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పోలీసులు కర్ణాటక ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రతి అంగుళం జల్లెడ పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook