భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్దమైన జియో

టెలికాం రంగంలో సంచలనాలను సృష్టిస్తున్న రిలయన్స్ జియో భారీగా ఉద్యోగాల నియామకాలను చేపట్టనుంది.

Last Updated : Jun 5, 2018, 01:46 PM IST
భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్దమైన జియో

టెలికాం రంగంలో సంచలనాలను సృష్టిస్తున్న రిలయన్స్ జియో భారీగా ఉద్యోగాల నియామకాలను చేపట్టనుంది. ఈ ఏడాది దాదాపు 75 వేల నుంచి 80వేల ఉద్యోగాలను నియమించుకోవాలని యోచిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) లో నిపుణులను నియమించనుండగా.. హైదరాబాద్ లేదా బెంగళూరులో టీంను ఏర్పాటు చేయనుంది. కాగా ఆకాశ్ అంబానీ నేతృత్వంలో వీరంతా పనిచేయనున్నట్లు మింట్‌ రిపోర్టు చేసింది.

 

ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ఆకాశ్ తీసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని జియో అధికారులు చెప్పినట్టు రిపోర్టు తెలిపింది. ఏఐతో పాటు మిషన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌పై పనిచేసే వారిని కంపెనీ రిక్రూట్ చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు కంపెనీలో 1,57,000 మంది ఉద్యోగులున్నారని, మరో 75-80 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు జియో చీఫ్‌ హెచ్ఆర్ తెలిపారు. జియో దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని, ‘రిలయన్స్‌ రెడీ’ అనే పేరుతో కొన్ని కోర్సులను కూడా ఈ కాలేజీలు ఆఫర్‌ చేస్తున్నాయని..ప్రస్తుతం  సోషల్‌ మీడియా ద్వారా కూడా నియామకాలు చేస్తున్నట్లు జియో వర్గాలు తెలిపాయి.

 

Trending News