SBI Alert: బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్‌బీఐకు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల బెడద వెంటాడుతోంది. అందుకే కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.
కరోనా సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్(Digital Payments)ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రజల్ని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన ఎస్‌బీఐకు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల బెడద వెంటాడుతోంది. అందుకే కస్టమర్లను ఆ ముప్పు నుంచి కాపాడేందుకు ఎప్పటికప్పుడు ఎస్‌బీఐ అప్రమత్తం చేస్తోంది. తగిన సూచనలు జారీ చేస్తోంది.
కస్టమర్లకు వచ్చే నకిలీ కస్టమర్ కేర్ (Fake Customer Care Numbers) నెంబర్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తోంది. సరైన కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరుతోంది. బ్యాంక్ ఎక్కౌంట్‌కు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తోంది. ఎందుకంటే నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు గానీ చేసినప్పుడు గానీ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని..ఎక్కౌంట్ నుంచి డబ్బులు తస్కరిస్తుంటారు. మరీ ముఖ్యంగా పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఎక్కౌంట్ నెంబర్, డెబిట్ కార్డు, ఓటీపీ వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దని పదే పదే హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. అందుకే సరైన కస్టమర్ కేర్ నెంబర్ కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరుతోంది.
మరోవైపు మీ ఇన్‌బాక్స్‌లో వచ్చే లింక్‌ల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీకు తెలియని నెంబర్ల నుంచి లింక్‌లు వచ్చినప్పుడు పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయవద్దు. లింక్‌లపై క్లిక్ చేస్తే ఆన్‌లైన్ మోసగాళ్ల ఉచ్చులో సులభంగా పడిపోతారు. ఒకవేళ మీరు ఏదైనా సందర్భంలో ఇలా మోసపోతే వెంటనే report.phising@sbi.co.in లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 155260కు కాల్ చేయమని ఎస్‌బీఐ (SBI)సూచిస్తోంది.
Also read: AP Zilla Parishad Elections: జిల్లా పరిషత్ ఎన్నికల్లో దూసుకుపోతున్న వైసీపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి