Supreme Court: కరోనా వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విధానం సరిగ్గా లేదని చెప్పిన సుప్రీంకోర్టు..పూర్తి డేటాను ఇవ్వాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.
దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానాన్ని సుప్రీంకోర్టు( Supreme Court) తప్పబట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగ్గా లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా 18-44 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సిన్ వేసే విధానం(Vaccination policy) సరిగ్గా లేదని తెలిపింది. వ్యాక్సిన్ కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాల్ని కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి తెలిపింది. వ్యాక్సిన్ వేసిన జనాభా డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ (Vaccine)వేసుకున్నవారి వివరాలు డేటా చెప్పాలని కేంద్రానికి సూచించింది.
దేశంలో గత 24 గంటల్లో 1 లక్షా 32 వేల 788 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2 లక్షల 31 వేల మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 17 లక్షల 93 వేల 645 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 3 వేల 207 మంది మరణించారు.
Also read: Mumbai High Court: అదార్ పూణావాలాపై ముంబై హైకోర్టు ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook