Supreme court: సుప్రీంకోర్టులో సగం మందికి కరోనా, ఇంటి నుంచే కేసుల విచారణ

Supreme court: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ సెగ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని తాకింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 శాతం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా వర్క్ ఫ్రం హోం ప్రారంభమైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2021, 12:40 PM IST
Supreme court: సుప్రీంకోర్టులో సగం మందికి కరోనా, ఇంటి నుంచే కేసుల విచారణ

Supreme court: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ సెగ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని తాకింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 శాతం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా వర్క్ ఫ్రం హోం ప్రారంభమైంది.

కరోనా మహమ్మారి (Corona pandemic) విజృంభిస్తోంది.  రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా లక్షా 68 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సైతం కరోనా సెగ తాకింది. సుప్రీంకోర్టు(Supreme court) లో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం తాజాగా కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూములతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బారినపడటంతో ఇక మీదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. తాజా కోవిడ్‌ కలకలం నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ నేడు ఓ గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించనున్నాయి. కాగా, శనివారం ఒక్క రోజే కోర్టులో 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది.

నా సిబ్బందిలోని చాలామంది లా క్లర్కులు కరోనా బారినపడ్డారని ఓ న్యాయమూర్తి తెలిపారు. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా.. ఆ తర్వాత కోలుకున్నారు. ఇండియాలో గత కొన్ని వారాలుగా వైరస్(Corona virus cases) తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది. 

Also read: Madhava Rao Passes Away: కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూత, ఫలితంపై ఆధారపడ్డ ఉప ఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News