Rain Alert: ఏపీ, తెలంగాణలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. నిన్న ఒడిశా తీరం, దాని పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం..ఇవాళ వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించి ఉంది.
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులపాటు వానలు పడనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు ఏపీలోనూ అల్పపీడన ప్రభావం అధికంగా ఉంది. తీరం వెంట పెను గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తాంధ్ర చిరుజల్లులు పడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల పొడి వాతావరణం, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. తీరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని..మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.
o Widespread light/moderate rainfall with heavy falls very likely over Arunachal Pradesh, Assam & Meghalaya and Nagaland, Manipur, Mizoram & Tripura during next 5 days.
ü Isolated very heavy falls also likely over Arunachal Pradesh, Assam & Meghalaya during 18th-21st July, 2022. pic.twitter.com/clur4Fe8xR— India Meteorological Department (@Indiametdept) July 17, 2022
Also read:Bonalu Live Updates: అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు... బంగారు బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత
Also read:PV Sindhu: దూసుకెళ్తున్న తెలుగు తేజం..తాజాగా సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.