Tamilnadu: తమిళనాడుకు మరోసారి హెచ్చరిక జారీ అయింది. మరో నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో విలవిల్లాడిన చెన్నైకు తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
భారీ వర్షాల నుంచి కోలుకోకముందే మరోసారి తమిళనాడును వర్షాలు వెంటాడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అండమాన్ సముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనాకేంద్రం(IMD)ఆదివారం ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో చెన్నై నగరం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు అవకాశం ఉంది. కన్యాకుమారిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశాలున్నాయి.
ఇప్పటికే గత 11 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains)రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లా భారీ నష్టాన్ని చవిచూసింది. 50 వేల ఇళ్లు నీటమునిగాయి. ఇంకా భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున కన్యాకుమారి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సేలం జిల్లాల్లోని మేట్టూరు డ్యామ్ నిండు కుండలా మారింది. కావేరి నది నీటి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా శనివారం రాత్రి 11.35 గంటలకు మేట్టూరు డ్యాం పూర్తి నీటి సామర్థ్యమైన 120 అడుగులకు చేరుకుంది. ప్రజా పనుల శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 93.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సెకనుకు 25 వేల 150 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. కావేరి నదీ తీరప్రాంతంలోని 12 జిల్లాలకు వరద ప్రమాదం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 90 శాతం పూర్తయినట్లు చెన్నై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 22 సబ్వేలలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని చెప్పారు. అయితే వాస్తవానికి చెన్నైలోని 70 వీధుల్లో వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రిలోగా వాటిని తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
Also read: Assam Rifles: భార్యతో ఆ జవాన్ చివరి ఫోన్ కాల్.. దాడికి కొద్ది గంటల ముందు ఏం చెప్పాడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe