The Lancet Report: కోవిడ్ రెండవదశ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాజా పరిశోధనలు అదే చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాక మెడికల్ జర్నల్ ది లాన్సెట్ జరిపిన అధ్యయనం వివరాలివి. తొలిదశలో మీరు చికిత్స ఎక్కడ తీసుకున్నారనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్(The Lancet) ఆసక్తికరమైన అధ్యయం చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఎవరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందనే విషయంలో. తొలిదశ కోవిడ్ సమయంలో ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకున్నవారిపై రెండవ దశ కోవిడ్ ప్రభావం (Corona Second Wave) అంతగా లేదని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది. గత ఏడాది మొదటి దశ సమయంలో స్వల్ప లక్షణాలున్నవారిలో చాలామంది ఆసుపత్రి బాట పట్టలేదు. ఇంట్లోనే ఉండి 14 రోజులపాటు వైద్యులు సూచించిన మందులు వాడి కోలుకున్నారు. కొందరి పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. వైద్యం అప్పుడే అందుబాటులో వస్తున్న సమయం కావడంతో ఆసుపత్రుల్లో ఇచ్చిన మందులు వాడటం వల్ల యాంటీ బాడీస్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.
దేశంలో తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన 8 వేల 983 మందిని, నెగెటివ్ వచ్చిన 80 వేల 893 మందిని ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఆ వివరాల ప్రకారం తొలిదశలో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని...రెండవ దశలో కోవిడ్ బారిన పడి ఉంటే..వారిలో 91 శాతం మందికి పెద్దగా సమస్యలు లేవు. మొదటి దశలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని రెండవ దశలో కోవిడ్ నెగెటివ్ వచ్చినా సరే...ఎక్కువగా మైగ్రేన్ , శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే వీలైనంతవరకూ ఇంట్లోనే ఉండి చికిత్స (Home Isolation) తీసుకోవడం ఉత్తమమని తాజా వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
Also read: Cowin Portal: కోవిన్ పోర్టల్ ఇకపై 14 ప్రాంతీయ భాషల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook