న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని విదేశీ వ్యవహారాల, పౌర విమానయాన, ఎయిర్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నట్లు తెలిపాయి. లాక్డౌన్ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానాలు విమానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆయా దేశాల్లోని పరిస్థిని బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
విదేశాలలో గల్ఫ్‌లో వేలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. మార్చి 24 నుండి గల్ఫ్ దేశాలు భారతీయ పౌరులను తమ స్వస్థలాలకు చేర్చాలని అన్నీ రకాలుగా భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడి తెస్తున్నాయి. కానీ ఒకవైపు దౌత్యపరమైన ఒత్తిడి మరోవైపు భారత్ లో విమానయాన సంస్థలకు టికెట్ల బుకింగ్ నిలిపివేయాలని కేంద్ర పౌర విమానయాన సంస్థ సూచిస్తోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా విమాన కార్యకలాపాలు దేశీయ, అంతర్జాతీయ రవాణాలు లాక్డౌన్ కారణంగా నిలిపివేయబడ్డాయి. లాక్-డౌన్ అమలుకు ముందు భారత పౌరులు అనేక మంది విదేశాలలో చిక్కుకున్నారు. COVID-19 వ్యాప్తిని కట్టడికి భారత్ ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డుతున్న విషయం తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా 26,000లకు పైగా పాజిటివ్ నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.