Uttar Pradesh: షాకింగ్.. ఆలయంలో నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించిన భక్తుడు...

UP Man Offers Tongue to Deity: ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడు కత్తితో నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 11, 2022, 10:55 AM IST
  • యూపీలో షాకింగ్ ఘటన
  • ఆలయంలో నాలుక కోసుకున్న భక్తుడు
  • అమ్మవారికి నాలుకను సమర్పించిన భక్తుడు
Uttar Pradesh: షాకింగ్.. ఆలయంలో నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించిన భక్తుడు...

UP Man Offers Tongue to Deity: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఉన్న శీతలా దేవి ఆలయంలో ఓ భక్తుడు చేసిన పని అందరినీ షాక్‌కి గురిచేసింది. భార్యతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన అతను.. కత్తితో తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించాడు. ఈ ఘటనతో ఆలయ సిబ్బందితో పాటు అక్కడే ఉన్న ఇతర భక్తులు నిర్ఘాంతపోయారు. తీవ్ర రక్తస్రావమవుతున్న అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఆలయంలో నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన ఆ వ్యక్తిని కౌశాంబి జిల్లాలోని పురబ్ షరీరా గ్రామానికి చెందిన సంపత్ (40)గా గుర్తించారు. మొదట కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో అతనికి  ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కౌశాంబి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి అతన్ని రిఫర్ చేయనున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కౌశాంబి పోలీసులు మాట్లాడుతూ.. భార్య బన్నో దేవితో కలిసి ఆలయానికి వెళ్లిన అతను మొదట కుబ్రీ ఘాట్‌లోని గంగా నదిలో స్నానం చేసినట్లు చెప్పారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన అతను.. వెంట తెచ్చిన కత్తితో నాలుకను కోసుకుని అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు. తన భర్త అలా చేస్తాడని తనకు కూడా తెలియదని బన్నో దేవి తెలిపారు. గతంలో చాలాసార్లు శీతలా దేవి ఆలయానికి వచ్చామని.. ఎప్పటిలాగే దర్శనం చేసుకుని వెళ్దామని శనివారం ఉదయం తన భర్త ఆలయానికి తీసుకొచ్చాడని పేర్కొన్నారు. తన భర్త త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

Also Read: Krishnam Raju Last Wsh: కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి కాదట.. ఏమిటో తెలుసా?

Also Read: Krishnam Raju Death: దిగ్గజ నటుడు కృష్ణంరాజు మరణంపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్ రియాక్షన్..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News