BJP National President: బిజెపి జాతీయ అధ్యక్షురాలుగా వసుంధర రాజే..? కమలం పార్టీ వ్యూహం అదేనా.. ?

BJP Natitonal President: భారతీయ జనతా పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షురాలిగా వసుంధరా రాజే నియమితులు కానున్నారా.. ? నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా తదుపరి అధ్యక్షురాలిగా వసుంధరా పేరును ఫైనలైజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసినట్టు సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 18, 2024, 10:32 AM IST
BJP National President: బిజెపి జాతీయ అధ్యక్షురాలుగా వసుంధర రాజే..? కమలం పార్టీ వ్యూహం అదేనా.. ?

BJP National President: భారతీయ జనతా పార్టీ ఈ సారి ఆశించిన సీట్లు రాలేదు. వాళ్లు చెప్పిన అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న
నినాదం పని  వర్కౌట్ కాలేదు. దీంతో పార్టీలో ప్రక్షాళన చేసే పనిలో పడింది. అంతేకాదు వాళ్లు అనుకున్న మ్యాజిక్ మార్క్ కు 40 సీట్ల దూరంలో ఆగింది. దీంతో కేంద్ర క్యాబినేట్ లో ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకోవడంతో కొత్త అధ్యక్షుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. జేపీ నడ్డా ప్లేస్ లో మధ్ర ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ పేరుతో పాటు కిషన్ రెడ్డిల పేరు వినిపించింది. కానీ వీళ్లిద్దరు కూడా నరేంద్ర మోడీ మూడో క్యాబినేట్ లో కేంద్ర క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో తదుపురి అధ్యక్షుడు ఎవరనేది సస్పెన్స్ ఏర్పడింది. ముందుగా హిమాచల్  ప్రదేశ్   నుంచి ఎంపీగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ కు ఈ సారి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు. అదే రాష్ట్రం నుంచి జేపీ నడ్డా ఎన్నిక కావడంతో ఆయన్ని క్యాబినేట్ లో తీసుకోలేదు.

దీంతో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ పేరు వినిపించింది. తాజాగా బీజేపీ అధిష్ఠానం ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా వసుంధరా రాజే పేరు పరిశీలిస్తుంది. దాదాపు ఆమెనే బీజేపీ తదుపరి అధ్యక్షురాలిగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమెను దూరంగా పెట్టి భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా చేయడంపై ఆమె వర్గీయులు బీజేపీపై ఒకింత అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు వసుంధరకు ఆర్ఎస్ఎస్ అండ కూడా పుష్కలంగా ఉంది.  మూడు సార్లు ముఖ్యమంత్రిగా.. రాజస్థాన్ లోని రాజ్ పుత్ వర్గానికి చెందిన వసుంధరాను అధ్యక్షురాలిగా నియమిస్తే ఈ ఎన్నికల్లో దూరమైన రాజ్ పుత్ వర్గాలు మళ్లీ బీజేపీకి చేరువయ్య అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   రీసెంట్ గా రాజస్థాన్ లో మొన్నటి ఎన్నికల్లో ఆమెను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలిగించినప్పటి నుంచి రాజ్ పుత్ వర్గీయలు గుర్రుగా ఉన్నారు. అది ఓట్ల రూపంలో కనిపించింది.

మరోవైపు బీజేపీకి ఇప్పటి వరకు ఎవరు మహిళ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసిన దాఖలాలు లేవు. ఒకవేళ వసుంధరా రాజే ఈ పదవి చేపడితే భారతీయ జనతా పార్టీగా తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలున్నాయి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News