Rain Alert: రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం..తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా తీరం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది.
మరోవైపు రుతు పవన ద్రోణి..జైసాల్మర్,కోట,మాండ్ల, రాయిపూర్, ఝార్సిగూడ మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్, విశాఖ, అమరావతి వాతావరణ శాఖలు వెల్లడించాయి. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఎల్లుండి మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఏపీలోనూ ఇదే వాతావరణం కొనసాగనుంది. తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటను వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
Also read:Mango Leaves Benefits: మామిడి ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Also read:CM KCR: వలసలను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా? విపక్షాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook