Rajasthan: రాజస్తాన్ టైగర్ రిజర్వ్‌లో కార్చిచ్చు.. తగలబడుతున్న అడవి.. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్...

Wildfire in Rajasthan Tiger Reserve: రాజస్తాన్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. శనివారం (మార్చి 27) సరిస్కా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మొదలైన ఈ కార్చిచ్చు 10 చదరపు కి.మీ వరకు విస్తరించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 06:45 PM IST
  • రాజస్తాన్ టైగర్ రిజర్వ్‌లో చెలరేగిన మంటలు
  • వేల ఎకరాల్లో తగలబడుతున్న అడవి
  • మంటలు ఆర్పేందుకు రంగంలోకి ఎయిర్ ఫోర్స్
Rajasthan: రాజస్తాన్ టైగర్ రిజర్వ్‌లో కార్చిచ్చు.. తగలబడుతున్న అడవి.. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్...

Wildfire in Rajasthan Tiger Reserve: రాజస్తాన్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. శనివారం (మార్చి 27) సరిస్కా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మొదలైన ఈ కార్చిచ్చు 10 చదరపు కి.మీ వరకు విస్తరించింది. ఇది 1800 ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంతో సమానం. మంటలను ఆర్పేందుకు ఇప్పటికే రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల నుంచి నీటిని చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంటలు చెలరేగడానికి కారణాలేంటన్నది ఇంకా వెల్లడికాలేదు. రెండు Mi 17 V5 హెలికాప్టర్స్ ప్రస్తుతం అక్కడ మంటలు ఆర్పుతున్నట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అటవీ సిబ్బంది సహా దాదాపు 150 నుంచి 200 మంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంటలు వ్యాపించిన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

సరిస్కా టైగర్ రిజర్వ్ తగలబడుతుండటంతో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఇక్కడ దాదాపు 20 పులులు ఉన్నాయి. ST-17 అనే పులి ఇటీవలే రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అటవీ అధికారులు వాటిని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 

Also Read: Viral News: 74 ఏళ్ల ఈ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌కి ఫిదా అవాల్సిందే... ఆ ఫ్లూయెన్సీ ఎలా వచ్చిందంటే.

Ravi Shastri: నేను ఐపీఎల్ వేలంలో ఉంటే.. 15 కోట్లకు అమ్ముడుపోయేవాడిని: టీమిండియా మాజీ కోచ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News