Barley Laddu Recipe: బార్లీ లడ్డూలు ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన భారతీయ స్వీట్. ఇవి బార్లీ గింజలు, నెయ్యి, బెల్లం, పప్పుదినుసులు ఇతర పదార్థాలతో తయారవుతాయి. బార్లీ గింజలు పోషకాలకు గొప్ప మూలం ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి ఉన్నాయి. ఈ లడ్డూలు శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
కావాల్సిన పదార్థాలు
బార్లీ- 1 కప్పు, పల్లీలు 1 రప్ప అవిసె గింజలు- 1 కప్పు, నెయ్యినే స్పూన్లు, బాదం- 10, జీడిపప్పు- 10, తురిమిన బెల్లం- 1 కప్పు, యాలకుల పొడి- కొద్దిగా
తయారీ విధానం
పాన్ లో భార్లీ గింజలను నేసి మాడిపోకుండా లోఫ్లేమ్ ఉంచి కదుపుతూ గోల్డెన్ కలర్ కి మారేంత వరకూ వేయించాలి. తర్వాత పల్లీలను, అన్ని గింజలను వేరువేరుగా రంగుమారేంత వరకూ వేయించి వర్షన్ ఉందుకోవాలి. కపుడు ప్యాచ్లో నెయ్యి వేసి బాదం, జీడిపప్పులను వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీల పొట్టు తీసేయాలి. జార్లో వేయించిన బార్లీ గింజలు, పల్లీలు, అవిసి గంజలను వేరువేరుగా మిక్సీ పెట్టాలి. ఈ మూడు పిండలను బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పాటు బెల్లం కూడా వేసి బాగా కలపాలి తర్వాత మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లో బార్లీ లడ్డూలు వేసుకోవాలి, ఇందులోకి వేయించిన బాదం, జీవనప్పులను నెయ్యితో సహా వేసి బాగా మర్చ్ చేయాలి. ఆ తర్వాత బడ్డూలు చేసుకోవాలి. లడ్డులు సరిగా రాకుంటే ఆ మిశ్రమంలో కొద్దిగా కాచిన నెయ్యి వేసి చేసుకోవచ్చు. ఈ లడ్డు రుచిగా ఉంటాయి.
చిట్కాలు:
బార్లీ గింజలను బాగా నానబెట్టడం వల్ల వాటిని మెత్తగా రుబ్బడం సులభం అవుతుంది.
శనగపిండిని ఎక్కువగా వేయించకూడదు లేకపోతే లడ్డూలు చేదుగా మారతాయి.
లడ్డూలను గాలి చొరబడకుండా డబ్బాలో నిల్వ చేస్తే, ఎక్కువ రోజులు పాటు తాజాగా ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
బార్లీ లడ్డూలు చాలా పోషకమైనవి, ఆరోగ్యకరమైనవి. వీటిలో ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బార్లీ లడ్డూలు జీర్ణక్రియకు మంచివి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బార్లీలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. బార్లీలోని బీటా-గ్లూకాన్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బార్లీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బార్లీలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి