Benefits Of Jamun Seeds: ఎంతటి రోగానైనా నయం చేసే ఆయర్వేద దివ్యౌషధం ఇదే..

Benefits Of Jamun Seeds: ప్రస్తుతం జీవన శైలిలో మార్పుల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి ఈ చిట్కాలను వినియోగించడం చాలా ఉత్తమం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 05:03 PM IST
Benefits Of Jamun Seeds: ఎంతటి రోగానైనా నయం చేసే ఆయర్వేద దివ్యౌషధం ఇదే..

Benefits Of Jamun Seeds: ఆధునిక జీవన శైలి కారణంగా మనిషి జీవితంలో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్న అంతేకాకుండా  ఊబకాయం సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ వ్యాధులతో బాధపడుతున్నవారు నియంత్రించుకోవడానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నేరేడు పండు గింజలను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నేరేగు గింజల ప్రయోజనాలు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు ఆహారపు అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల  మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి  జామున్ గింజల పొడిని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పొడిని క్రమం తప్పకుండా మధుమేహం ఉన్నవారు వినియోగిస్తే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి.

పొట్ట సమస్యల నుంచి ఉపశమనం:
ఈ గింజల పొడిలో ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, ఖనిజాలు, విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో పీచు పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా పొట్ట సమస్యలన్నీ సులభంగా తగ్గతుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి:
నేరేడు పండు గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇవి శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను సులభంగా తొలగిస్తాయి. దీంతో శరీరం డిటాక్సిఫై అవుతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తిని వేగంగా పెంచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడుతున్నవారికి ఔషధంలా పని చేస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్ 

Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News