Chaddannam Recipe: వేసవిలో పొట్టను హాయిగా ఉంచే పెరుగు చద్దన్నం రెసిపీ.. 2 నిమిషాల్లో తయారు చేసుకోండి..

Perugu Chaddannam Recipe: ప్రతిరోజు ఉదయం పూట పెరుగు చద్దన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ చద్దన్నం మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా?

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 17, 2024, 10:34 PM IST
Chaddannam Recipe: వేసవిలో పొట్టను హాయిగా ఉంచే పెరుగు చద్దన్నం రెసిపీ.. 2 నిమిషాల్లో తయారు చేసుకోండి..

Perugu Chaddannam Recipe In Telugu: మన పూర్వీకులు కాయకష్టం చేస్తూ ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకునేవారు.. అందుకే వారు ఎంతో బలంగా దృఢంగా ఉండగలిగారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీనికి కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిజానికి ప్రతిరోజు ఉదయం పూట పెరుగుతో చేసిన చద్దన్నం తినడం వల్ల శరీరాన్ని బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరాన్ని యాక్టివ్‌గా చేయడమే, కాకుండా జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీని కారణంగా చాలామంది ఉదయం పూట పెరుగుతో తయారుచేసిన చద్దన్నం తింటున్నారు. అయితే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా..? ఈ స్టోరీ మీకోసమే..

పెరుగు చద్దన్నం రెసిపీ:
కావలసిన పదార్థాలు:

✩ 2 కప్పుల ఉడికించిన అన్నం
✩ 1 కప్పు పెరుగు
✩ 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర
✩ 1/4 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ
✩ 1/4 కప్పు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు
✩ 1 టేబుల్ స్పూన్ నూనె
✩ 1/2 టీస్పూన్ ఆవాలు
✩ 1/4 టీస్పూన్ జీలకర్ర
✩ 1/4 టీస్పూన్ సోంపు
✩ 1/4 టీస్పూన్ పసుపు
✩ 1/4 టీస్పూన్ ఉప్పు
✩ 1/4 టీస్పూన్ కారం
✩ 1/4 టీస్పూన్ నిమ్మరసం

తయారీ విధానం:
✩ ఈ చద్దన్నం తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాల్సిన ఉంటుంది. ఉడికించిన అన్నం, పెరుగు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
✩ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
✩ ఆ తర్వాత స్టవ్ పై చిన్న కళాయి పెట్టుకుని అందులో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర సోంపు పసుపు వేసి పక్కన పెట్టుకున్నా అన్నానికి తాలింపు పెట్టుకోవాలి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
✩ ఇలా తాలింపు పెట్టుకున్న మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా లేదా ఒక అర్థగంట ఆగిన తర్వాత తింటే భలే ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం.
✩ అంతేకాకుండా ఈ అన్నాన్ని మరుసటి రోజు ఉదయం కూడా తినొచ్చు.

చిట్కాలు:
✩ ఈ పెరుగన్నం మరింత రుచిగా తయారు చేసుకోవడానికి ఇందులో దానిమ్మ గింజలను కూడా వినియోగించవచ్చు.
✩ అలాగే ఈ అన్నం పొడుపుగా ఉండడానికి కొంత నిమ్మరసాన్ని కూడా వినియోగించవచ్చు.
✩ పోపు పెట్టుకునే క్రమంలో పచ్చిమిరపకాయతో పాటు అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News