Collagen Rich Foods: కొల్లాజెన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఎముకలు కూడా బలంగా మారుతాయి. అయితే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే కొన్ని ఆహారాలు ఉంటాయి. వీటిని మీ డైట్ లో చేర్చుకుంటే వృద్ధాప్యం మీ దరిదాపుల్లోకి త్వరగా రాదు.
బెర్రీ పండ్లు..
బెర్రీ పండ్లు మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచడం కాదు. ఈ బెర్రీ జాతి పండ్లను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రాస్బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెరీలు మీ డైట్ లో ఉండాలి.
గుడ్లు..
గుడ్డులో విటమిన్ డి ఉంటుంది.. ప్రతిరోజు గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. అయితే గుడ్లు అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. జుట్టు ఆరోగ్యానికి మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అంతేకాదు చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. గుడ్లలో సల్ఫర్ ఉంటుంది, ప్రతిరోజు మన డైట్లో చేర్చుకోవడం మంచిది.
సీట్రస్ పండ్లు..
సీట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఎందులో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతాయి. అయితే సీట్రస్ పండ్లు అంటే లెమన్, ఆరెంజ్ ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా తోడ్పడతాయి. ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్ సీ ఉండటం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
వెల్లుల్లి..
వెల్లుల్లి మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. వెల్లుల్లిలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే గుణం ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెంచుతుంది. అల్లిసిన్ ఉంటుంది.
ఆకుకూరలు..
ఆకుకూరలు మన డైట్ లో ఉండాలని వైద్యులు సూచిస్తారు. ఆకుకూరల్లో విటమిన్ ఏ ఉంటుంది. కంటి చూపును మెరుగు చూస్తుంది. అదే విధంగా ఇందులో ఉండే విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉత్పత్తికి తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి.
ఇదీ చదవండి: నిమ్మకాయ, ఆరెంజ్ మాత్రమే కాదు విటమిన్ సి పుష్కలంగా ఉండే మరో 6 ఆహారాలు..
బీన్స్..
బీన్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, స్కిన్ సాగే గుణాన్ని అందిస్తుంది. బీన్స్‌తో ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి మాత్రం కూడా తోడ్పడుతుంది. బీన్స్ కూరల్లో చేర్చుకోవడం సులభం. ఇవి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. బీన్స్ సలాడ్, సూప్స్‌లో వేసుకుని తింటారు.
గింజలు..
గింజలు ముఖ్యంగా జీడిపప్పు, బాదంపప్పు, వాల్నట్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. వీటితో ఆరోగ్యం అయితే గింజలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. గింజలు డైట్లో చేర్చుకోవడం వల్ల అనే ఆరోగ్య సమస్యలను తొలగిస్తాయి. అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు. గింజలు డైట్లో చేసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి కూడా తోడ్పడుతుంది. దీంతో మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: బ్రోకలీ ఒక సూపర్ ఫుడ్.. నమ్మలేని 4 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు షాకే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి