Diabetes Control Chutney: మధుమేహంతో బాధపడుతున్న వారు తరచుగా ఆహారాల్లో కాకరకాయలతో తయారుచేసిన చట్నీలు లేదా ఫ్రైని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే కొన్ని ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఆహారాల్లో కాకరకాయను వినియోగించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. అయితే క్రమం తప్పకుండా కాకరకాయ తినడం వల్ల శరీరానికి ఇవే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాకరకాయలో ఉండే కొన్ని మూలకాలు కొట్టను ఆరోగ్యంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అయితే చాలామంది చేదు కాకరకాయను తినేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారికోసం చేదు లేకుండా కాకరకాయ చట్నీ రెసిపీని పరిచయం చేయబోతున్నాం.
కాకరకాయ చట్నీ తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - 2
ఎర్ర మిరపకాయలు - 5-6
వెల్లుల్లి రెబ్బలు - 5-6
ఉప్పు - రుచికి సరిపోతుంది
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
కరివేపాకు - కొన్ని రెమ్మలు
నూనె - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఈ చట్నీ ని తయారు చేయడానికి కాకరకాయలను శుభ్రం చేసుకుని కాటన్ గుడ్డతో నీరు లేకుండా తుడుచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోని విత్తనాలను బయటికి తీయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక చిన్న జార్లో ఎర్ర మిరపకాయలతో పాటు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని గ్రైండర్‌లో వేసి మిక్సీ కొట్టుకోవాలి.
ఆ తర్వాత అదే గ్రైండర్ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ అయిన తర్వాత ఉప్పు వేసి మరోసారి మెత్తని మిశ్రమంలో గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్‌పై ఓ బౌల్ పెట్టుకొని దానిపై కళాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని కాస్త వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేంతవరకు బాగా వేయించుకోవాలి.
అన్ని వేగిన తర్వాత అందులో చివరగా కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి.. ఆ తర్వాత మీరు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దింపుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లబరుచుకోవాలి. మొత్తం చల్లబడిన తర్వాత నిమ్మ రసాన్ని కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని భద్రపరుచుకుంటే దాదాపు పది రోజులకు పైగానే ఆహారాల్లో వినియోగించవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
కాకరకాయ చట్నీని రుచికరంగా చేయడానికి కొద్దిగా కొత్తిమీర లేదా కొబ్బరి తురుము వేయవచ్చు.
కాకరకాయ చట్నీని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే, ఒక గ్లాస్ జార్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి.
ఈ కాకరకాయ చట్నీని ఆహారాల్లో తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే రుచి మరింత పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.