New Year 2025 Wishes: కాలం గిర్రున తిరిగిపోయింది. చూస్తుండగానే 2024 సంవత్సరం కూడా వెళ్లిపోయింది. క్షణాలు.. నిమిషాలు.. గంటలు.. రోజులు ఇలా కళ్లముందే వెళ్లిపోయాయి. అందరి జీవితాల్లో 2024 చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది. కష్టనష్టాలు.. సుఖదుఃఖాలు.. ఆనందాలు.. సంతోషాలు ఇలా అన్ని కలగలిసిన 2024కు వీడ్కోలు పలుకుదాం. కొత్త ఆశలతో 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. అయితే కొత్త సంవత్సరం అంటే కేవలం నంబర్ మారుతుంది.. కానీ ఇంకేం మారదనే విషయాన్ని గుర్తించాలి.
Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం
శుభాకాంక్షలు చెప్పండి ఇలా..
- ఇన్నాళ్లు చేసిన తప్పొప్పులు.. తప్పటడుగులు సరిదిద్దుకుని కొత్త సంవత్సరంలో జీవితాన్ని చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
- కాలం గిర్రున తిరిగిపోయింది. ఈ ఏడాదిలో నీతో గడిపిన కాలం చెరిగిపోనిది. మన బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
- నా ఆత్మీయ మిత్రుడికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మన స్నేహ బంధంలో ఒక ఏడాది గడిచిపోయింది. కొత్త ఏడాది స్వాగతం పలికింది. ఈ ఏడాది కూడా మన స్నేహం మరింత బలంగా ఉండాలని.. మనమిద్దరం కలిసి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. మిత్రమా మరోసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
- మీరు ఇచ్చిన జీవితం నా అదృష్టం. ఈ ఏడాది మిమ్మల్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించా. ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని మరింత ప్రేమగా.. ఆనందంగా చూసుకుంటానని చెబుతూ ప్రియమైన నా కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
- నీ ప్రేమలోకంలో మునుగుతున్న నాకు 2024 ఒక క్షణంలా గడిచిపోయింది. 2025లోనూ నీ ప్రేమ మరింత పొందాలని ఆశిస్తూ.. నా గుండెసఖి నీకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు
- మారుతుంది నంబర్ మాత్రమే. కాలం అలాగే ఉంటుంది.. రోజు అలాగే తెల్లారుతుంది. కానీ మారాల్సిందల్లా మన జీవితం. మిత్రమా ఈ ఏడాదిలో నీవు అత్యున్నత శిఖరాలు పొందాలని ఆశిస్తూ.. 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
- కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. నీ లక్ష్య సాధన 2025లో పూర్తి కావాలని.. నీ ఆశయ సాధనలో నేను భాగం కావాలని ఆకాంక్షిస్తున్నా. మిత్రమా కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
- ప్రియమైన అమ్మనాన్నకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేయడంలో.. మిమ్మల్ని ఆనందింపచేయడంలో.. మీ ఆకాంక్షలు తీర్చడంలో నిమగ్నమై ఉన్నా. మీ ఆశలు తీర్చే క్రమంలో 2024 ఏడాది ముగిసి 2025 వచ్చేసింది. మరింత ప్రేమ పంచుతానని.. మీ ఆశయాలు తీరుస్తానని హామీ ఇస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అమ్మనాన్న.
Also Read: Allu Arjun Bouncers: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook