Hotel style Gunta ponganalu Recipe: ఉదయం లేవగానే లేదా సాయంత్రం సమయంలో ఏ బ్రేక్ పాస్ట్ లేదా స్నాక్ చేసుకుంటే బాగుంటుందని మనం ఆలోచిస్తాం. మనకు అతి తక్కువ సమయంలో తక్కువ పదార్థాల్తో తయారు చేసుకోవాలని అనుకుంటాం. అయితే, సాధారణంగా టిఫిన్ అంటేనే మనం ఇడ్లీ, దోశ, పూరీ తయారు చేసుకుంటాం. అయితే, 20 నిమిషాల్లో త్వరగా పూర్తయ్యే గుంగ పొంగనాలు ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా? ఈ గుంతపొంగనాలు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా రుచికరంగా ఉంటుంది కొబ్బరి చట్నీతో తీసుకుంటే ఆ రుచే వేరు గుంతపొంగనాలను బియ్యం, మినప్పప్పు వేసి తయారు చేసుకుంటారు. ఇది మంచి స్నాక్ ఐటెంలా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీని హోటల్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు..
దోష బ్యాటర్ ఒక కప్పు
కొత్తిమీర -పావు కప్పు
జీలకర్ర -అరటి స్పూను
రుచికి సరిపడా ఉప్పు
నూనె
ఉల్లిపాయలు - పావు కప్పు
క్యారెట్ -పావు కప్పు
ఇదీ చదవండి: చర్మాన్ని చమక్కుమనిపించే వేప.. మన స్కిన్‌పై ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్..!
గుంతపొంగనాలను ఆ ఫోటో స్టైల్ లో తయారు చేసే విధానం..
ఒక బౌల్ తీసుకొని అందులో దోష బ్యాట్టర్ వేసి అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, అల్లం కొత్తిమీర జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు గుంతపొంగనాలు ప్యాన్ తీసుకొని మీడియం హీట్ లో స్టవ్ ఆన్ చేసి దానిపై పెట్టుకోవాలి. మౌల్డ్ మొత్తానికి కొద్దిగా నూనె రాసుకోవాలి
ఆ తర్వాత ప్యాన్ వేడి అవ్వగానే అందులో గుంతపొంగనాలు పోసుకోవాలి. మూడు వంతుల పిండి వేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: మీ జుట్టుకు కొబ్బరి నీళ్లు ఇలా వాడారంటే.. జుట్టు నల్లగా.. మందంగా.. నడుము వరకు పెరుగుతుంది..
ఇప్పుడు పాన్ పై ఒక మూత పెట్టుకోవాలి. దాని మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది.
ఆ గుంతపొంగనాలపై భాగం బంగారు వర్ణంలోకి మారగానే అది క్రిస్పీగా మారిందని అర్థం. దీన్ని ఒక స్పూన్ లేదా మరో వైపు తిప్పుకోవాలి.
మరోవైపు కూడా మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే అది గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఆ పెనం పైనుంచి గుంతపొంగనాలు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి వీటిని రుచికరమైన కొబ్బరి చట్నీతో తీసుకుంటే రుచి అదిరిపోద్ది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి