Soya Chunks For Health: శాఖాహారులు మాంసానికి బదులుగా సోయాబీన్స్ ను ఆహారంగా నేర్చుకుంటారు. ఇవి చూడడానికి అచ్చం మాంసంలో ఉన్న ముక్కల్లా కనిపిస్తాయి. కానీ వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల మాంసాహారాల్లో కంటే ఎక్కువగా ప్రోటీన్లు లభిస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రభావంతంగా కృషి చేస్తాయి. అంతేకాకుండా వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర వహిస్తాయి.
ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు దోహదపడతాయి. సోయాబీన్స్ లో ఆమెనో యాసిడ్స్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తాయి. రక్తనాళాల్లోని వ్యర్ధాలను శుభ్రం చేసి గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. కాబట్టి గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా సోయాబీన్స్ ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా తర్వాత చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ శక్తి తగ్గడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అయితే ఇలాంటి వారు సోయాబీన్స్ తో చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని, అంతేకాకుండా శరీరంలో ఈ రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇందులో ఉండే మూలకాలు సీజనల్ వ్యాధులను కూడా సులభంగా దూరం చేస్తుంది. ముఖ్యంగా జ్వరం జలుబు ఇతర వ్యాధులను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సీజనల్ వ్యాధులకు గురయ్యే వారు ఈ సోయాబీన్స్ ను తప్పకుండా తీసుకోవాలి.
సోయాబీన్స్ లో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా తగ్గిస్తాయి. ఇది జీర్ణ క్రియను సులభతరం చేసి కొందరిలో బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి జీర్ణ క్రియ సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాకుండా కంటిచూపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.)
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook