Vankaya Bajji Recipe In Telugu: సాయంత్రం అయిందంటే చాలు చాలామంది ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది భారతీయులు ఈవినింగ్ పూట టీతోపాటు బజ్జీలు లేదా పకోడీలను తీసుకోవడం అలవాటుగా వస్తోంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లోనైతే, ఇప్పటికీ 50 సంవత్సరాల నుంచి నడుపుతున్న టీ బజ్జీల హోటల్స్ ఉన్నాయంటే వాటికి ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. చాలామంది బజ్జీలను సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లల గురించి అయితే చెప్పనక్కర్లేదు. పిల్లలు గుడ్డు బజ్జీల నుంచి వంకాయ బజ్జీల వరకు ఎంతో ఇష్టంగా కోరుకొని చేయించుకుని తింటూ ఉంటారు. అయితే చాలామంది ఈ వంకాయ బజ్జీలను ఎక్కువగా స్ట్రీట్లలో లభించే షాపుల్లో కొనుక్కొని తింటూ ఉంటారు. నిజానికి ఇలా బయట లభించే వాటిని తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని మీకు ఈరోజు మేము తెలియజేయబోతున్నాం. ఈ వంకాయ బజ్జీలను ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వంకాయ బజ్జీ రెసిపీలకు కావలసిన పదార్థాలు:
✤ వంకాయలు - 4
✤ శనగపిండి - 1 కప్పు
✤ పుట్నాల పొడి - 1/2 కప్పు
✤ ఉప్పు - రుచికి సరిపడా
✤ కారం - 1 టీస్పూన్
✤ ధనియాల పొడి - 1 టీస్పూన్
✤ వాము - 1/2 టీస్పూన్
✤ పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
✤ ఉల్లిపాయ - 1/2 (సన్నగా తరిగినవి)
✤ కొత్తిమీర - 1/4 కప్పు (సన్నగా తరిగినవి)
✤ నూనె - వేయించడానికి
తయారీ విధానం:
✤ వంకాయ బజ్జీలను తయారు చేసుకోవడానికి ముందుగా వంకాయలను నీటిలో వేసుకొని ఐదు నిమిషాల పాటు నానబెట్టి బాగా శుభ్రంగా చేసుకోవాలి.
✤ ఇలా శుభ్రంగా చేసుకున్న వంకాయలను సన్నని ముక్కలుగా బాగా కట్ చేసుకోవాలి.
✤ ఆ తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, పుట్నాల పిండి, ఉప్పు, కారం వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి.
✤ ఇలా కలిపిన పిండిలోనే వాము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి మరోసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. కొంచెం కొంచెం నీరు పోస్తూ బజ్జీల పిండిలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
✤ ఆ తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనెను పోసుకొని సన్నని మంటపై బాగా వేడి చేసుకోవాలి.
✤ ఇలా కలుపుకున్న పిండిలో ఒక్కొక్క సన్నని వంకాయ ముక్కను ముంచుతూ స్టవ్ పై పెట్టుకున్న కళాయిలో వేసుకోవాల్సి ఉంటుంది.
✤ ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ రంగులోకి వచ్చేవరకు బజ్జీలను బాగా వేయించాల్సి ఉంటుంది. అంతే సులభంగా తెలంగాణ స్టైల్ వంకాయ బజ్జీ రెడీ అయినట్లే.
✤ వేడి వేడిగా టమాటో సాస్ లేదా చట్నీతో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది.
చిట్కాలు:
✤ వంకాయలు చాలా పెద్దదిగా ముదిరిపోయినవిగా ఉంటే వాటిని మధ్యలోకి కోసుకొని అందులో ఉన్న గింజలను తీసేయాల్సి ఉంటుంది.
✤ బజ్జీలు వేసే క్రమంలో పిండి చిక్కగా లేదా పల్చగా కాకుండా చూసుకోవడం ఎంతో మంచిది.
✤ నూనె బాగా వేడిగా ఉంటే బజ్జీలు బయట మాత్రమే కాలి, లోపల పచ్చిగా ఉంటాయి.
✤ బజ్జీలు మరింత రుచిగా కావాలనుకునేవారు బజ్జీల పిండిలో కొద్దిగా పెరుగు లేదా పచ్చిమిర్చి పేస్ట్ ను యాడ్ చేసుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి