Belly fat Tips: అల్లోవెరాను రోజూ ఇలా తీసుకుంటే..3 వారాల్లో బెల్లీ ఫ్యాట్ మాయమై..శిల్పాశెట్టి లాంటి నడుము మీ సొంతం

Belly fat Tips: అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బెల్లీ ఫ్యాట్. ఈ రెండు సమస్యల్ని గట్టెక్కేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే..అందమైన నాజుకు నడుము మీ సొంతమౌతుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2023, 10:21 PM IST
Belly fat Tips: అల్లోవెరాను రోజూ ఇలా తీసుకుంటే..3 వారాల్లో బెల్లీ ఫ్యాట్ మాయమై..శిల్పాశెట్టి లాంటి నడుము మీ సొంతం

ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బాధపడేది అధిక బరువు లేదా బెల్లీ ఫ్యాట్ సమస్యతోనే. అల్లోవెరా ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక బరువుకు చెక్ పెడతాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం మెటబోలిజం వేగవంతమై..బెల్లీ ఫ్యాట్ కూడా మాయమౌతుంది. 

అల్లోవెరాతో అధిక బరువుకు చెక్ 

మీ శరీరంలోంచి బెల్లీ ప్యాట్ లేదా కొవ్వు కరిగించేందుకు వేడి నీళ్లతో అల్లోవెరా జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే ఇంకా మంచిది. బెల్లీ ఫ్యాట్ అద్భుతంగా కరుగుతుంది. రుచి కూడా బాగుండటంతో సేవించడంలో ఏ విధమైన ఇబ్బంది ఉండదు.

అల్లోవెరా జ్యూస్

అల్లోవెరా జ్యూస్ తయారు చేసేందుకు ఒక అల్లోవెరా ఆకు, రెండు కప్పుల నీరు తీసుకోవాలి. అల్లోవెరా ఆకు నుంచి జిగురు తీసి బ్లెండర్‌లో వేసి మిక్సీ చేయాలి. ఆ తరువాత ఇందులో నీళ్లు వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. అంతే అల్లోవెరా జ్యూస్ సిద్ధమైనట్టే. రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు చాలా వేగంగా తగ్గుతారు. రుచి కోసం అవసరమైతే కొద్దిగా బ్లాక్ పెప్పర్, సాల్ట్ వేసుకోవచ్చు.

తేనె

తేనె అద్భుతమైన యాంటీ ఆక్సిడెంటల్, యాంటీ ఫంగల్ గుణాల వేదిక. తేనె రోజూ సేవిస్తే కొవ్వు వేగంగా కరుగుతుంది. అల్లోవెరా జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి తాగితే మెరుగైన ఫలితాలుంటాయి.

నడుము చుట్టూ పేరుకుపోయే కొవ్వు కరిగించేందుకు రోజూ ఒక స్పూన్ అల్లోవెరా జిగురు తింటే చాలా మంచిది. ప్రతిరోజూ భోజనానికి కాస్సేపు ముందు తీసుకోవాలి. అల్లోవెరాలో విటమిన్ బి పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా ఫ్యాట్ కాస్తా ఎనర్జీగా మారుతుంది. 

Also read: Amla Hair Care Tips: ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు కావాలా.. వారానికి రెండుసార్లు ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News